iDreamPost
android-app
ios-app

ఆ టీమిండియా క్రికెటర్ అంటే నాకు చచ్చేంత ఇష్టం: సోనాలి బింద్రే!

  • Published May 11, 2024 | 3:55 PM Updated Updated May 11, 2024 | 3:55 PM

క్రికెటర్లకు సాధారణ అభిమానులతో పాటు సెలబ్రిటీల్లోనూ ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా వాళ్లకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. టాలీవుడ్ సీనియర్ నటి సోనాలి బింద్రే కూడా ఓ క్రికెటర్ అంటే తనకు చచ్చేంత ఇష్టమని అంటోంది.

క్రికెటర్లకు సాధారణ అభిమానులతో పాటు సెలబ్రిటీల్లోనూ ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా వాళ్లకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. టాలీవుడ్ సీనియర్ నటి సోనాలి బింద్రే కూడా ఓ క్రికెటర్ అంటే తనకు చచ్చేంత ఇష్టమని అంటోంది.

  • Published May 11, 2024 | 3:55 PMUpdated May 11, 2024 | 3:55 PM
ఆ టీమిండియా క్రికెటర్ అంటే నాకు చచ్చేంత ఇష్టం: సోనాలి బింద్రే!

క్రికెటర్లకు సాధారణ అభిమానులతో పాటు సెలబ్రిటీల్లోనూ ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్లకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. చాలా మంది హీరోయిన్లకు క్రికెటర్లు అంటే పిచ్చి. ప్లేయర్లకు, హీరోయిన్లకు మధ్య లవ్ యాంగిల్ ఉండటం కూడా తెలిసిందే. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లాడాడు కూడా. ఇలా క్రికెట్​కు, ఫిల్మ్ ఇండస్ట్రీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. లవ్, పెళ్లి లాంటివి పక్కనబెడితే క్రికెటర్ల నుంచి స్ఫూర్తి పొందుతుంటామని, వాళ్ల గేమ్​ తమకు చాలా ఇష్టమని పలువురు సినీ ప్రముఖులు చెబుతుంటారు. టాలీవుడ్ సీనియర్ నటి సోనాలి బింద్రే కూడా ఓ క్రికెటర్ అంటే తనకు చచ్చేంత ఇష్టమని అంటోంది. ఆమెకు నచ్చిన ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే తనకు పిచ్చి అని సోనాలి బింద్రే తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా భారత ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల్లో ఎవరంటే ఇష్టమని సోనాలికి ప్రశ్న ఎదురైంది. దీనికి వెంటనే ఆమె కోహ్లీ అంటే ఇష్టమని చెప్పింది. అతడు చాలా ఇన్​స్పైరింగ్ పర్సన్ అని తెలిపింది. కోహ్లీ-అనుష్క జోడీ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది. ‘విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జోడీ అంటే నాకు ఎంతో ఇష్టం. వాళ్లిద్దరూ చాలా క్యూట్​గా ఉంటారు. వాళ్లిద్దర్నీ ఒక చోట చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది. అందుకే నాకు విరాట్ అంటే ఇష్టం. అతడు చాలా స్ఫూర్తివంతమైన వ్యక్తి. ఎందరికో కోహ్లీ ఆదర్శంగా నిలుస్తున్నాడు’ అని సోనాలి చెప్పుకొచ్చింది.

ఇక, తెలుగులో ‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘ఖడ్గం’ వంటి పలు బ్లాక్​బస్టర్స్​లో నటించిన సోనాలి బింద్రే ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటోంది. క్యాన్సర్​ను జయించిన ఆమె.. చావు నుంచి ఎలా బయటపడిందో ఆ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. తనకు క్యాన్సర్ ఉందనే విషయం తన కుటుంబాన్ని కలచి వేసిందని తెలిపింది. ఈ విషయం చెప్పగానే తన భర్త నైరాశ్యంలో కూరుకుపోయారని పేర్కొంది. కీమోథెరపీ వల్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని.. చావు నుంచి బయటపడ్డానంటూ చికిత్స జరిగినప్పటి రోజుల్ని తలచుకొని ఆమె ఎమోషనల్ అయింది. కాగా, క్యాన్సర్ నుంచి రికవరీ అయ్యాక ‘బ్రోకెన్ న్యూస్’ అనే వెబ్ సిరీస్​తో అలరించింది సోనాలి. మరి.. కోహ్లీ అంటే తనకు ఎంతో ఇష్టమంటూ సోనాలి చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş