టిమ్ డేవిడ్ సిక్స్ కొడితే.. ఫ్యాన్ దవడ పగిలిపోయింది!

Fan Got Injured For Tim David Six: ఢిల్లీ క్యాపిటల్స్- ముంబయి ఇండియన్స్ మధ్య ఆసక్తికర పోరు సాగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో టిమ్ డేవిడ్ కొట్టిన సిక్సర్ కి ఫ్యాన్ గాయపడ్డాడు.

Fan Got Injured For Tim David Six: ఢిల్లీ క్యాపిటల్స్- ముంబయి ఇండియన్స్ మధ్య ఆసక్తికర పోరు సాగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో టిమ్ డేవిడ్ కొట్టిన సిక్సర్ కి ఫ్యాన్ గాయపడ్డాడు.

ఢిల్లీ వేదికగా మరోసా రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్- ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన హోరా హోరీ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్ జట్టు ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయింది. ఢిల్లీ టాపార్డర్ మొత్తం విజృంభించింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఎలాంటి బౌలర్ వచ్చినా కూడా వారి విధ్వంసానికి కట్టలు వేయలేకపోయారు. ముఖ్యంగా జేక్ ఫ్రాజర్ పరుగుల వరద పారించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓవర్లోనే 20 పరుగులు రాబట్టాడు. అయితే ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ లో తమ సత్తా చాటింది. టాపార్డర్ విఫలమైనా కూడా మంచి స్కోర్ రాబట్టారు. దాదాపుగా విజయానికి చేరువయ్యారు. ఈ మ్యాచ్ లో టిమ్ డేవిడ్ కొట్టిన ఒక సిక్సర్ కి ఓ ఫ్యాన్ కు గాయమైంది.

ఈ మ్యాచ్ లో ముంబయి టాపార్డర్ విఫలమైనా కూడా మిడిలార్డర్ కాపాడింది. గౌరవ ప్రదమైన స్కోర్ వచ్చిందంటే అది మిడిలార్డర్ పుణ్యమే. ఇషాన్ కిషన్(20), రోహిత్(8), సూర్య కుమార్ యాదవ్(26) పరుగులే చేసినా కూడా తిలక్ వర్మ(63) ఆఖరి వరకు పోరాడాడు. ఈసారి కెప్టెన్ హార్దిక్ పాండ్యా(46) కూడా ఈసారి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ, ముందే భారీ స్కోర్ సమర్పించుకోవడంతో గెలుపు కష్టమైంది. వీరికి తోడు టిమ్ డేవిడ్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 17 బంతుల్లోనే 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. ముకేష్ కుమార్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్ లో టిమ్ డేవిడ్ కొట్టిన 3 సిక్సర్లు ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. అలాగే ఒక సిక్సర్ కి అయితే ఓ అభిమానికి గాయం అయ్యింది. టిమ్ డేవిడ్ కొట్టిన భారీ సిక్సర్ ని ఫ్యాన్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, ఎదుటి వారి చేతులు తగిలి అది వచ్చి నేరుగా అతని ముఖానికి తాకింది. అతనికి రక్తం కూడా కారినట్లు కనిపించింది. అతడిని వెంటనే సెక్యూరిటీ చికిత్స నిమిత్తం తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం టిమ్ డేవిడ్ కొట్టిన ఈ సిక్సర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్- ముంబయి ఇండియన్స్ మ్యాచ్ మాత్రం ఆఖరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగింది.

258 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన హార్దిక్ సేన కేవలం 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్, టిమ్ డేవిడ్ లాంటి వాళ్లు మరో ఓవర్ క్రీజులో ఉంటే.. మ్యాచ్ కచ్చితంగా ముంబయి జట్టు గెలిచి ఉండేది. కానీ, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లానింగ్, ఎక్సిక్యూషన్ ముందు ముంబయి జట్టు తేలిపోయింది. కానీ, ఛేజింగ్ లో 247 పరుగులు సాధించి ఔరా అనిపించారు. మొత్తానికి మ్యాచ్ పోయినా కూడా ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ మాత్రం వారి పోరాటానికి ఫిదా అయిపోయారు. మరి.. ఢిల్లీ క్యాపిటల్స్- ముంబయి ఇండియన్స్ మ్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments