Last IPL For Dhoni: ధోనీకి ఇదే చివరి IPL.. క్లారిటీ ఇచ్చేశాడుగా!

ధోనీకి ఇదే చివరి IPL.. క్లారిటీ ఇచ్చేశాడుగా!

MS Dhoni- IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు పెద్ద షాకే తగిలింది. ధీనో జట్టు పగ్గాలు వదిలేసి.. రుతురాజ్ గైక్వాడ్ ను కొత్త కెప్టెన్ గా చేశాడు. అది మాత్రమే కాకుండా.. ఇంకో షాక్ కూడా ఉంది అంటున్నారు.

MS Dhoni- IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు పెద్ద షాకే తగిలింది. ధీనో జట్టు పగ్గాలు వదిలేసి.. రుతురాజ్ గైక్వాడ్ ను కొత్త కెప్టెన్ గా చేశాడు. అది మాత్రమే కాకుండా.. ఇంకో షాక్ కూడా ఉంది అంటున్నారు.

క్యాష్ రిచ్ లీగ్ మరికొన్ని గంటల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను సిద్ధం చేసుకున్నాయి. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 ఎడిషన్ ప్రారంభమవుతుంది. ఈసారి జట్లలో చాలానే మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా కెప్టెన్స్ విషయంలో అని చెప్పాలి. ఇప్పటికే ముంబయి జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పగ్గాలు అందుకున్నాడు. అలాగే ఢిల్లీకి పంత్ తిరిగి వచ్చేశాడు. ఇప్పుడు కెప్టెన్ విషయంలో చెన్నై జట్టు వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే కెప్టెన్స్ ఫొటో షూట్ కి సీఎస్కే తరఫున ధోనీ రాకుండా.. రుతురాజ్ గైక్వాడ్ హాజరయ్యాడు. ఇక్కడే ధోనీ కెరీర్ కి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వినిపిస్తున్నాయి.

ఎంఎస్ ధోనీ.. చెన్నె సూపర్ కింగ్స్ ని వేరు చేసి చూడటం ఎవరికీ సాధ్యం కాదు. ఫ్రాంచైజీ మొదలైనప్పటి నుంచి ధోనీనే కెప్టెన్ గా ఉంటూ వచ్చాడు. చెన్నై జట్టును 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ఛాంపియన్ గా నిలిపాడు. అలాగే ఎందరో యంగ్ ప్లేయర్స్ చెన్నై జట్టు ద్వారా పరిచయం అయ్యేలా చేశాడు. చెన్నై జట్టుకు ఐపీఎల్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేశాడు. అలాంటి ధోనీ ఇప్పుడు చెన్నై జట్టు కెప్టెన్సీ పగ్గాలు వదిలేశాడు. తన తర్వాత చెన్నై జట్టుకు కెప్టెన్ గా రుతురాజ గైక్వాడ్ ను ఎంపిక చేసింది ఫ్రాంచైజీ.

రుతురాజ్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించడంలో కచ్చితంగా ధోనీ ప్రమేయం ఉంటుందనే చెప్పాలి. రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్ కి చెన్నై పగ్గాలు అందిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని ధోనీ భావించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఫ్రాంచైజీ కూడా ధోనీ నిర్ణయంతో ఏకీభవిస్తూ రుతురాజ్ ను చెన్నై జట్టు కెప్టెన్ గా చేసి ఉండచ్చు. ఏది ఏమైనా కెప్టెన్ గా మాత్రం ధోనీ తప్పుకుని అభిమానులకు గట్టి షాకే ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అభిమానులను కలవర పెడుతోంది. అలాంటి ఆలోచన ధోనీకి మాత్రం రాకూడదు అంటూ కోరుకుంటున్నారు.

ఇదే చివరి IPL:

చెన్నై జట్టు ఫ్యాన్స్ భయం అంటే.. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని అంతా భావిస్తున్నారు. నిజానికి ఈ సీజన్ కూడా ఆడడు అనుకున్నారు. కానీ, చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేయడం, ధోనీ కూడా జట్టుతో కలవడం చూశాక హ్యాపీగా ఫీలయ్యారు. కానీ, ఇవాళ జరిగిన విషయం చూసి ధోనీ ఐపీఎల్ కెరీర్ విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు. ధోనీ ఇంక వచ్చే ఐపీఎల్ ఆడడు అని ఫిక్స్ అయిపోతున్నారు. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాది ధోనీ ఆడడు అంటూ వచ్చిన వార్తలు నిజమయ్యే ఉంటాయి అంటున్నారు. ధోనీ ఐపీఎల్ ఆడను అంటే.. ఫ్రాంచైజీ రిక్వెస్ట్ చేసి ఈ ఏడాదికి ఆడేందుకు ఒప్పించి ఉంటుంది అంటున్నారు. తన సమక్షంలో జట్టును ఒక కొత్త కెప్టెన్ చేతిలో పెట్టి.. జట్టును ఒక దారిలో పెట్టాలని కోరి ఉండచ్చు. ధోనీ కూడా ఫ్రాంచైజీతో ఉన్న అనుబంధం, జట్టు మీద ఉన్న బాధ్యతతో ఇందుకు ఒప్పుకుని ఉండచ్చు అంటున్నారు. ఇలా రుతురాజ్ గైక్వాడ్ కి బాధ్యతలు అప్పగించి.. ఈ ఏడాదికి జట్టును సరైన మార్గంలో పెట్టి వచ్చే ఏడాది నుంచి ధోనీ ఐపీఎల్ కి కూడా వీడ్కోలు పలుకుతాడు అంటున్నారు. మరి.. ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments