Nidhan
భారత జట్టుకు హెడ్ కోచ్‌గా పని చేయాలని ఉందని ఓ ఆస్ట్రేలియా లెజెండ్ అన్నాడు. కోచ్‌గా వస్తా అంటూనే ఒక మెలిక కూడా పెట్టాడు.
భారత జట్టుకు హెడ్ కోచ్‌గా పని చేయాలని ఉందని ఓ ఆస్ట్రేలియా లెజెండ్ అన్నాడు. కోచ్‌గా వస్తా అంటూనే ఒక మెలిక కూడా పెట్టాడు.
Nidhan
టీమిండియాకు కొత్త కోచ్ రానున్నాడనే విషయం తెలిసిందే. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంకొన్నాళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగుతాడు. అమెరికా-వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్-2024తో ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. నవంబర్ 2021లో భారత జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టిన ఈ దిగ్గజం.. వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీ ముగిసే వరకు కోచ్‌గా ఉన్నాడు. పదవీకాలం పూర్తవడంతో తాను తప్పుకుంటానని భారత క్రికెట్ బోర్డుకు చెప్పాడు. కానీ టీ20 ప్రపంచ కప్‌కు ఎక్కువ టైమ్ లేకపోవడంతో అప్పటిదాకా కోచ్‌గా ఉండమని కోరడంతో కంటిన్యూ అవుతున్నాడు. అయితే ఇప్పుడు ఆ గడువు కూడా ముగియడంతో ద్రవిడ్ ప్లేస్‌లో కొత్త కోచ్ రావడం ఖాయంగా మారింది.
కొత్త కోచ్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది బీసీసీఐ. జీతం, అర్హతలు తదితర వివరాలతో ప్రకటన కూడా విడుదల చేసింది. భారత నయా కోచ్ రేసులో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా, గౌతం గంభీర్‌తో పాటు ఇంకా పలువురు ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా లెజెండ్, లక్నో సూపర్ జియాంట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియాకు కోచ్‌గా రావాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. భారత జట్టుకు కోచ్‌గా పని చేయడం అంటే మామూలు విషయం కాదని.. అది ఓ అద్భుతమైన రోల్ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇండియాలో టాలెంటెడ్ క్రికెటర్లకు లెక్క లేదని.. ప్రతిభావంతులను పట్టుకొని సానబెడితే అద్భుతాలు చేస్తారన్నాడు.
‘భారత జట్టుకు కోచ్‌గా పని చేయడం అనేది ఎక్స్ట్రార్డినరీ రోల్. ఈ దేశంలో ప్రతిభావంతులైన ప్లేయర్లకు కొదువ లేదు. కానీ టీమిండియాకు కోచ్‌గా రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ దిశగా నేను అంతగా ఆలోచించలేదు. ఒక ఇంటర్నేషనల్ కోచ్‌గా ఉండటం అంటే ఏంటో నాకు తెలుసు. అంతర్జాతీయ జట్టును కోచ్‌గా వెనుక ఉండి నడిపించడం అంత ఈజీ కాదు. వాళ్ల మీద ఎంతో ప్రెజర్ ఉంటుంది’ అని లాంగర్ చెప్పుకొచ్చాడు. ఒకవైపు భారత జట్టుకు కోచ్‌గా ఉండాలని ఉందంటూనే, మరోవైపు ఆ దిశగా తాను ఆలోచించలేదంటూ మెలిక పెట్టాడు లాంగర్. అతడి మాటల్ని బట్టి టీమిండియాకు కోచ్‌గా వర్క్ చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఒత్తిడి గురించి ఆలోచించి వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరి.. భారత జట్టుకు కోచ్‌గా ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Justin Langer said “Coaching the Indian team would be an extraordinary role, from what I’ve seen with the amount of talent I’ve seen in this country, it would be fascinating but I have never thought about it, I understand the pressure of being an International coach”. [TOI] pic.twitter.com/QfUUZT9nPT
— Johns. (@CricCrazyJohns) May 14, 2024