Nidhan
టీ20 వరల్డ్ కప్‌కు ఇంకా ఎక్కువ టైమ్ లేదు. ఐపీఎల్-2024 ముగిసిన కొద్ది గ్యాప్‌లోనే మెగా టోర్నీ మొదలుకానుంది. త్వరలోనే పొట్టి కప్‌లో ఆడే టీమ్స్ తమ స్క్వాడ్‌ను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లకు మాజీ బ్యాటర్ సురేష్ రైనా ఓ రిక్వెస్ట్ చేశాడు.
టీ20 వరల్డ్ కప్‌కు ఇంకా ఎక్కువ టైమ్ లేదు. ఐపీఎల్-2024 ముగిసిన కొద్ది గ్యాప్‌లోనే మెగా టోర్నీ మొదలుకానుంది. త్వరలోనే పొట్టి కప్‌లో ఆడే టీమ్స్ తమ స్క్వాడ్‌ను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లకు మాజీ బ్యాటర్ సురేష్ రైనా ఓ రిక్వెస్ట్ చేశాడు.
Nidhan
ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్-2024కు టైమ్ దగ్గర పడుతోంది. మెగా టోర్నీ మొదలవడానికి ఇంకా ఎంతో కాలం లేదు. జూన్ 2వ తేదీన పొట్టి కప్పుకు తెరలేవనుంది. దీంతో ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. యూఎస్ఏ-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 కప్పును ఎగరేసుకుపోవాలని అన్ని టీమ్స్ అనుకుంటున్నాయి. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడి టైటిల్‌ను చేజార్చుకున్న టీమిండియా కూడా ఇదే ఆలోచనతో ఉంది. వన్డే కప్ మిస్సయింది.. కాబట్టి టీ20ల్లోనైనా ఛాంపియన్స్‌గా నిలవాలని భావిస్తోంది. త్వరలోనే వరల్డ్ కప్‌లో ఆడే భారత జట్టును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఏయే ఆటగాళ్లు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పేస్ ఆల్‌రౌండర్ పొజిషన్‌కు తీవ్ర పోటీ ఉండటంతో ఎవర్ని తీసుకుంటారో చెప్పలేని పరిస్థితి. సీనియర్ ప్లేయర్ హార్దిక్ పాండ్యాతో పాటు శివమ్ దూబె ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు. హార్దిక్ ఫామ్‌లో లేడు. బ్యాటర్‌గా, బౌలర్‌గా తరచూ ఫెయిల్ అవుతున్నాడు. దూబె మాత్రం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ రోల్ కోసం ఎవర్ని తీసుకోవాలనే దానిపై మాజీ ఆటగాడు రైనా రియాక్ట్ అయ్యాడు. శివమ్ దూబెను టీమిండియాలోకి తీసుకోవాలని అతడు అన్నాడు. ఎలాగైనా సరే భారత జట్టులో దూబెకు స్థానం కల్పించాలని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ను అతడు రిక్వెస్ట్ చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియోలో ఓ పోస్ట్ పెట్టాడు.
శివమ్ దూబెను వరల్డ్ కప్‌లో ఆడించాలి.. అగార్కర్ భాయ్ ప్లీజ్ అతడ్ని సెలక్ట్ చేయండి అంటూ రైనా ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. దీనికి అగార్కర్‌ను ట్యాగ్ చేశాడు. రైనా ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ప్రపంచ కప్ జట్టులో దూబె ఉండాల్సిందేనని.. అతడ్ని మించిన ఫినిషర్ దొరకడంటూ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ ఫామ్‌లో లేడని.. ముంబై వరుస ఓటములు, పూర్ ఫామ్, ట్రోలింగ్‌తో అతడు మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడని అంటున్నారు. అదే దూబె ఫుల్ కాన్ఫిడెన్స్‌తో రఫ్ఫాడిస్తున్నాడని చెబుతున్నారు. ఇక, ఈ ఐపీఎల్లో ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచుల్లో 311 పరుగులు చేశాడు దూబె. 169 స్ట్రైక్ రేట్‌తో అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. గ్రౌండ్లోకి దిగింది మొదలు బౌలర్లను ఊచకోత కోస్తున్న దూబె.. లక్నోతో నిన్న జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. మరి.. దూబెను వరల్డ్ కప్‌లో ఆడించాలంటూ రైనా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Suresh Raina makes a request to Chief selector Ajit Agarkar. pic.twitter.com/F7HsQBXmju
— CricTracker (@Cricketracker) April 24, 2024