Tirupathi Rao
SRH vs RCB- Rajat Patidar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు ఇది. ఉప్పల్ స్టేడియంలో రజత్ పటిదార్ మినీ సునామీని సృష్టించాడు. తన ఆటతో కింగ్ కోహ్లీని కూడా మెస్మరైజ్ చేశాడు.
SRH vs RCB- Rajat Patidar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు ఇది. ఉప్పల్ స్టేడియంలో రజత్ పటిదార్ మినీ సునామీని సృష్టించాడు. తన ఆటతో కింగ్ కోహ్లీని కూడా మెస్మరైజ్ చేశాడు.
Tirupathi Rao
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఉప్పల్ వేదికగా రసవత్తర పోరు సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా 300 పరుగులు చేస్తామంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ధీమా వ్యక్తం చేసింది. కానీ, ఆ ఛాన్స్ లేకుండా పోయింది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మరోసారి 250+ స్కోర్ చేస్తుందని ఎదురుచూసిన హైదరాబాద్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. అయితే ఉప్పల్ వేదికగా పరుగుల వరద అయితే పారుతుందని అర్థమవుతోంది. ఎందుకంటే ఆర్సీబీ జట్టు మైదానంలో మినీ సునామీ సృష్టిస్తోంది. ఫస్ట్ ఓవర్ నుంచే బాదుడు మొదలెట్టేశారు. త్వరగానే 2 వికెట్లు పడినప్పటికీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతోంది. కోహ్లీ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. కోహ్లీకి తోడుగా రజత్ పటీదార్ విజృంభిస్తున్నాడు.
ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ లో కూడా పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆర్సీబీ జట్టు 12 ఓవర్లకే 2 వికెట్ల నష్టానికి ఏకంగా 127 పరుగులు చేసింది. డుప్లెసిస్(25), విల్ జాక్స్(6) త్వరగానే ఔట్ అయినా.. కోహ్లీ, పటిదార్ మాత్రం హైదరాబాద్ బౌలర్లను కాస్త కంగారు పెట్టారు. కోహ్లీ కాస్త దూకుడు తగ్గించగానే.. రజత్ పటిదార్ ఫామ్ లోకి వచ్చాడు. బౌలర్లపై విరుచుకు పడ్డాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆర్సీబీ తరఫున వేగంగా ఆర్ధ శతకాలు నమోదు చేసిన ఖాతాలో 19 బంతుల్లో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో పటిదార్ మయాంక్ మర్కండేకి భయం అంటే ఏంటో చూపించాడు. ఒక వికెట్ తీసిన జోరు మీద ఉన్న మర్కండేని పటిదార్ భయ పెట్టేశాడు.
26 runs off the bat in the 11th over.
Thank you, Rajat! You were outstanding! 🫡#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #SRHvRCB pic.twitter.com/2YzQr4eei0
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 25, 2024
మయాంక్ మర్కండే ఓవర్లో పటిదార్ ఏకంగా 4 వరుస సిక్సులు బాదేశాడు. 11వ ఓవర్లో తొలి బంతిని కోహ్లీ సింగిల్ తీశాడు. రెండో బంతి నుంచి ఐదో బంతి దాకా రజత్ పటిదార్ వరుస సిక్సులు కొట్టాడు. ఆఖరి బంతిని సింగిల్ తీసుకున్నాడు. కాసేపు ఉప్పల్ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించాడు. రజత్ పటిదార్ హిట్టింగ్ కి కోహ్లీ కూడా షాకయ్యాడు. పటిదార్ సిక్సులు స్మాష్ చేస్తుంటే కోహ్లీ అదర్ ఎండ్ లో ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు. వరుసగా 4 సిక్సులు పడటంతో ఆర్సీబీ ఫ్యాన్స్ లో జోష్ పెరిగింది. కాకపోతే 50 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఉనద్కట్ వేసిన బంతికి క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు.
Rapid fire Rajat got to his 3rd fifty this season, and it came in a jiffy🔥#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #SRHvRCB pic.twitter.com/26BM50eI0g
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 25, 2024
ప్రస్తుతం విరాట్ కోహ్లీ మాత్రం పోరాడుతూనే ఉన్నాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో కోహ్లీ అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అదర్ ఎండ్ లో వికెట్లు పడుతున్నా కూడా కోహ్లీ మాత్రం ఎంతో ఏకాగ్రతగా.. ఒక లక్ష్యంతో పోరాడుతూనే ఉన్నాడు. ఇంక సన్ హైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ చూస్తే.. నటరాజన్, మయాంక్ మర్కండే, జయదేవ్ ఉనద్కట్ లకు తలో వికెట్ దక్కింది. 14 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. స్కోర్ బోర్డు 200 దాటేలాగే ఉంది. అయితే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నారు.
Playing the situation and perfectly anchoring another brilliant innings.
Fifty #53 for Virat in the IPL 🫡#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #SRHvRCB pic.twitter.com/GHVN9gdFNX
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 25, 2024