SRH Opener Abhishek Sharma In World Cup Squad: వరల్డ్ కప్ టీమ్​లోకి SRH ఓపెనర్ అభిషేక్ ఎంట్రీ.. అంతా ప్లాన్ ప్రకారమే!

వరల్డ్ కప్ టీమ్​లోకి SRH ఓపెనర్ అభిషేక్ ఎంట్రీ.. అంతా ప్లాన్ ప్రకారమే!

ఐపీఎల్-2024లో సన్​రైజర్స్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. ఒకదాన్ని మించిన రేంజ్​లో మరో నాక్ ఆడుతూ ప్రత్యర్థి జట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు.

ఐపీఎల్-2024లో సన్​రైజర్స్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. ఒకదాన్ని మించిన రేంజ్​లో మరో నాక్ ఆడుతూ ప్రత్యర్థి జట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు.

ఐపీఎల్-2024లో సన్​రైజర్స్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. ఒకదాన్ని మించిన రేంజ్​లో మరో నాక్ ఆడుతూ ప్రత్యర్థి జట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 14 మ్యాచుల్లో కలిపి 209 స్ట్రైక్ రేట్​తో 467 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ లిస్ట్​లో టాప్​-10లో నిలిచాడతను. మరో ఎస్ఆర్​హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (201) తప్పితే ఈ లిస్ట్​లో ఉన్న ఒక్కరి స్రైక్ రేట్ కూడా అభిషేక్​కు దగ్గర్లో లేదు. దీన్ని బట్టే ఈ సీజన్​లో అతడి డామినేషన్ ఏ లెవల్​లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నీళ్లు తాగినంత అలవోకగా బౌండరీలు, సిక్సులు కొడుతున్నాడు అభిషేక్. ఈ సీజన్​లో 40కి పైగా సిక్సులు బాదాడు. తద్వారా ఓ సీజన్​లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాంటి అభిషేక్​కు గోల్డెన్ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది.

ఈ ఐపీఎల్ ఆసాంతం ధనాధన్ ఇన్నింగ్స్​లతో అదరగొట్టాడు అభిషేక్ శర్మ. నిన్న పంజాబ్ కింగ్స్ మీద కూడా 28 బంతుల్లోనే 66 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బౌండరీల కంటే సిక్సులు ఎక్కువగా కొడుతున్న అభిషేక్.. ఉన్నంత సేపు పరుగుల వరద పారిస్తున్నాడు. అతడి టాలెంట్​కు ఫిదా అయిన బీసీసీఐ వరల్డ్ కప్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైందని క్రికెట్ వర్గాల సమాచారం. ప్లాన్ ప్రకారమే అతడ్ని అమెరికా గడ్డ మీద దించబోతున్నారని తెలుస్తోంది. ఓపెనర్​గా వచ్చి ఎలాంటి భయం లేకుండా భారీ షాట్లు బాదుతూ స్కోరు బోర్డును బుల్లెట్ వేగంతో పరుగులు పెట్టిస్తున్న అభిషేక్​ సామర్థ్యం బోర్డుతో పాటు సెలెక్టర్లు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కూడా ఇంప్రెస్ చేసిందట. అందుకే ప్రపంచ కప్ స్క్వాడ్​లో అతడికి చోటు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారని వినిపిస్తోంది.

మే 25వ తేదీ వరకు వరల్డ్ కప్ స్క్వాడ్​లో మార్పుచేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చివరగా స్క్వాడ్​లో అభిషేక్​ పేరును జోడించి ఫైనలైజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఓపెనర్​గా అభిషేక్ ఇదే స్థాయిలో అదరగొడితే టీమిండియాకు ఎదురుండదని, అందుకే జట్టులోకి అతడ్ని తీసుకోవడం పక్కా అని అంటున్నారు. ఓపెనర్​గా టీమ్​లో చోటు దక్కించుకున్న యశస్వి జైస్వాల్ ఐపీఎల్​లో అంతగా ఆకట్టుకోలేదు. లెఫ్టాండర్ అయిన అభిషేక్ దూకుడు మంత్రంతో వేగంగా పరుగులు చేయడం, అటు జైస్వాల్ ఫెయిల్ అవడంతో అతడికి బదులు ఈ ఎస్​ఆర్​హెచ్​ ఓపెనర్​ను రీప్లేస్ చేస్తారని సమాచారం. కుదిరితే జైస్వాల్ స్థానంలో తీసుకోవడం లేదా రిజర్వ్​డ్ ఆటగాళ్లలో ఒకడిగానైనా వరల్డ్ కప్​కు మాత్రం అభిషేక్ వెళ్లడం ఖాయమనే పుకార్లు వస్తున్నాయి. మరి.. పొట్టి కప్పుకు అభిషేక్ వెళ్తే బాగుంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments