Nidhan
రోహిత్ శర్మ ఐపీఎల్లో ఒకప్పుడు డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడేవాడు అనేది తెలిసిందే. అయితే డీసీలో ఉన్నప్పుడు అతడ్ని రాజులా చూసుకుందో బ్యూటీ. వాళ్లది నెక్స్ట్ లెవల్ బాండింగ్ అని చెప్పక తప్పదు.
రోహిత్ శర్మ ఐపీఎల్లో ఒకప్పుడు డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడేవాడు అనేది తెలిసిందే. అయితే డీసీలో ఉన్నప్పుడు అతడ్ని రాజులా చూసుకుందో బ్యూటీ. వాళ్లది నెక్స్ట్ లెవల్ బాండింగ్ అని చెప్పక తప్పదు.
Nidhan
రోహిత్ శర్మ అంటే చాలు ఐపీఎల్ అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది ముంబై ఇండియన్సే. ఆ టీమ్‌కు కెప్టెన్‌గా ఉంటూ 5 సార్లు టైటిల్‌ను అందించాడు హిట్‌మ్యాన్. ముంబై సారథిగా సక్సెస్ అవడంతో ఆ తర్వాత కాలంలో భారత జట్టు కెప్టెన్‌గానూ అతడికి అవకాశం వచ్చింది. ఇప్పుడు టీమిండియా కెప్టెన్‌గా రాణిస్తున్న రోహిత్.. ఐపీఎల్లో మాత్రం కేవలం ప్లేయర్‌గానే ఆడుతున్నాడు. ముంబైకి కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించడంతో హిట్‌మ్యాన్ బ్యాటర్‌గానే కంటిన్యూ అవుతున్నాడు. అయితే అతడు ఒకప్పుడు డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడాడనే సంగతి తెలిసిందే. ఆ టీమ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఇటీవల షేర్ చేసుకున్నాడు కూడా. డీసీలో ఉన్నప్పుడు రోహిత్‌ను రాజులా చూసుకుంది ఓ బ్యూటీ. ఆమె ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..
2008లో జరిగిన ఫస్ట్ సీజన్ నుంచి మూడేళ్ల పాటు డెక్కన్ ఛార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు రోహిత్. అతడి కెరీర్ స్టార్టింగ్ డేస్ అవి. అప్పట్లో హిట్‌మ్యాన్‌కు అంత క్రేజ్ లేదు. ఒకవైపు ఆఫ్ స్పిన్‌తో వికెట్లు తీస్తూ, మరోవైపు బ్యాట్‌తోనూ చెలరేగుతూ తన సత్తా చాటాడు. ఫీల్డింగ్‌లోనూ మెరుస్తూ టీమ్‌లో కీలక ప్లేయర్‌గా మారాడు. అయితే గిల్‌క్రిస్ట్, సైమండ్స్, గిబ్స్ లాంటి దిగ్గజాల నడుమ అనామకుడిగా ఉండేవాడు. ఆ టైమ్‌లో అతడ్ని ఓ బ్యూటీ రాజులా చూసుకుంది. ఆమెనే డీసీ ఓనర్ టీ వెంకట్రామ్ రెడ్డి కూతురు గాయత్రి రెడ్డి. అప్పట్లో రోహిత్-గాయత్రికి మధ్య మంచి బాండింగ్ ఉండేది. ఇద్దరూ తక్కువ సమయంలోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు.
డెక్కన్ ఛార్జర్స్ మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియానికి గాయత్రి తరచూ వచ్చేది. ఆ టైమ్‌లో మ్యాచ్ తర్వాత గాయత్రితో గ్రౌండ్లో సరదాగా మాట్లాడుతూ కనిపించేవాడు రోహిత్. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆమె బాగా ఎంకరేజ్ చేసేది. ఒకసారి ప్యాడ్స్ వేసుకొని గ్రౌండ్లో క్రికెట్ కూడా ఆడింది గాయత్రి. ఇలా హిట్‌మ్యాన్‌తో ఆమె అనుబంధం అప్పట్లో హైలైట్‌గా మారింది. పెద్దగా క్రేజ్ లేని రోహిత్లో ఫ్యూచర్ స్టార్‌ను చూసిన గాయత్రి అతడ్ని బాగా ప్రోత్సహించింది. ఫ్రాంచైజీలో ఉన్నప్పుడు అతడికి అన్ని విషయాల్లోనూ సపోర్ట్‌గా ఉంది. అయితే ఆ తర్వాత ముంబై నుంచి ఆఫర్ రావడంతో రోహిత్ ఆ టీమ్‌కు వెళ్లిపోయాడు. అలా వీళ్ల మధ్య బాండింగ్‌కు బ్రేక్ పడింది. కాగా, ఇటీవల గిల్‌క్రిస్ట్‌తో చిట్‌చాట్ సందర్భంగా డీసీ థీమ్ సాంగ్ తనకు చాలా ఇష్టమని రోహిత్ అన్నాడు. దీన్ని మించినది మరొకటి లేదన్నాడు. ఆ కామెంట్స్‌ను గాయత్రి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకోవడం విశేషం.
Rohit used to rizz this beauty once 😭 pic.twitter.com/QrxQJs1EQM
— 🇵🇹🐐 (@Wanderers30_) April 19, 2024