Nidhan
ఈసారైనా కప్పు కొడుతుందనుకుంటే ఆర్సీబీ కథ మళ్లీ ప్లేఆఫ్స్‌లోనే ముగిసింది. దీంతో విరాట్ కోహ్లీ సహా బెంగళూరు ఆటగాళ్లు నిరాశలో కూరుకుపోయారు.
ఈసారైనా కప్పు కొడుతుందనుకుంటే ఆర్సీబీ కథ మళ్లీ ప్లేఆఫ్స్‌లోనే ముగిసింది. దీంతో విరాట్ కోహ్లీ సహా బెంగళూరు ఆటగాళ్లు నిరాశలో కూరుకుపోయారు.
Nidhan
ఈసారైనా కప్పు కొడుతుందనుకుంటే ఆర్సీబీ కథ మళ్లీ ప్లేఆఫ్స్‌లోనే ముగిసింది. దీంతో విరాట్ కోహ్లీ సహా బెంగళూరు ఆటగాళ్లు నిరాశలో కూరుకుపోయారు. ఐపీఎల్-2024 ఫస్టాఫ్‌లో వరుస ఓటములతో విసుగు తెప్పించిన ఆర్సీబీ.. ఆ తర్వాత గాడిలో పడింది. ప్లేఆఫ్స్‌కు టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఉత్సాహంగా ఆడింది. వరుసగా ఆరు మ్యాచుల్లో విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కు దర్జాగా క్వాలిఫై అయింది డుప్లెసిస్ సేన. ఇదే ఊపులో ఫైనల్స్ వరకు వెళ్లి కప్పును కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ కోహ్లీ టీమ్ జోరుకు రాజస్థాన్ రాయల్స్ బ్రేకులు వేసింది. నిన్న జరిగిన ఎలిమినేటర్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించింది. కీలక మ్యాచ్‌లో ఓటమితో బెంగళూరు ఆటగాళ్ల మీద భారీగా విమర్శలు వస్తున్నాయి.
రాజస్థాన్ చేతుల్లో ఆర్సీబీ ఓడిపోవడంతో ముఖ్యంగా విరాట్ కోహ్లీని టార్గెట్ చేసుకొని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇన్ని సీజన్లుగా ఆడుతున్నా ఒక్కసారి కూడా జట్టుకు కప్పు అందివ్వలేదని విమర్శిస్తున్నారు. బిగ్ మ్యాచెస్‌లో రన్స్ చేయడం అతడికి చేతకాదని సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ రియాక్ట్ అయ్యాడు. కోహ్లీని విమర్శించడానికి ఎవరికీ హక్కు లేదన్నాడు. భారత్‌కు అతడు రియల్ హీరో అని ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ దేశానికి అతడు రోల్ మోడల్ అని.. అలాంటోడి మీద విమర్శలు చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదన్నాడు ఏబీడీ. ఎప్పుడూ విరాట్‌నే టార్గెట్ చేస్తుంటారని.. అతడ్ని ఇంతగా క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించాడు.
‘ఈ దేశానికి హీరో లాంటోడు విరాట్ కోహ్లీ. కోట్లాది మందికి అతడు రోల్ మోడల్. అలాంటోడి చుట్టూ ఇంతగా విమర్శలు వ్యాపించడం ఎంతవరకు కరెక్ట్?’ అని నిలదీశాడు డివిలియర్స్. రాజస్థాన్ చేతుల్లో ఆర్సీబీ ఓటమి తనను ఎంతగానో బాధించిందన్నాడు. కానీ టీమ్ ఆటతీరు, ఓటముల నుంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చిన విధానంపై గర్వంగా ఉన్నానని తెలిపాడు. గెలవగలమనే నమ్మకాన్ని ఆర్సీబీ ఆటగాళ్లు కలిగించారన్నాడు. బెంగళూరును తక్కువగా అంచనా వేయొద్దన్నాడు. వచ్చే ఏడాది బెంగళూరు స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తుందని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించాడు. కచ్చితంగా కప్పు గెలుస్తారని డివిలియర్స్ జోస్యం పలికాడు. మరి.. ఏబీడీ చెప్పినట్లు వచ్చే ఏడాది ఆర్సీబీ కప్పు నెగ్గుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Ab De Villiers said – “I thought it was really bad for someone like that for a Hero and a role model of the country to get so much criticism around that”. (On Virat Kohli). pic.twitter.com/aXLGAY5h56
— Tanuj Singh (@ImTanujSingh) May 23, 2024