iDreamPost

Virat Kohli: వీడియో: కోహ్లీ సిక్సుల వర్షం.. డుప్లెసిస్ రియాక్షన్ వైరల్!

  • Published May 18, 2024 | 8:07 PMUpdated May 18, 2024 | 8:07 PM

ప్లేఆఫ్స్​కు వెళ్లాలంటే కీలకంగా మారిన నాకౌట్ మ్యాచ్​లో చెన్నై మీద చెలరేగిపోయాడు విరాట్ కోహ్లీ. ఈ ఆర్సీబీ స్టార్ సిక్సులతో విరుచుకుపడ్డాడు.

అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. ఆర్సీబీ-సీఎస్​కే మధ్య నాకౌట్ మ్యాచ్ మొదలైంది. ప్లేఆఫ్స్​కు వెళ్లాలంటే కీలకంగా మారిన ఈ ఫైట్​లో చెలరేగిపోయాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఈ బెంగళూరు స్టార్ సిక్సులతో విరుచుకుపడ్డాడు. 9 బంతులు ఎదుర్కొన్న కింగ్.. 1 ఫోర్, 2 సిక్సులతో 19 పరుగులు చేశాడు. అతడు కొట్టిన ఓ సిక్స్​కు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్​ డుప్లెసిస్ (12 నాటౌట్) షాకయ్యాడు. ఇదేం కొట్టుడు సామి అంటూ నోరెళ్లబెట్టాడు.

సీఎస్​కే పేసర్ తుషార్ దేశ్​పాండే వేసిన మూడో ఓవర్​లో రెండు సిక్సులు బాదాడు కోహ్లీ. మిడ్ వికెట్ మీద పడిన తొలి బంతిని డీప్ స్క్వేర్ లెగ్ దిశగా కొట్టాడు. అది కాస్తా స్టేడియం రూఫ్​ టాప్​ మీద వెళ్లి పడింది. దాన్ని చూసి డుప్లెసిస్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత మూడో బంతిని అదే వైపు సిక్స్​గా మలిచాడు కోహ్లీ. అతడు మంచి ఊపులో ఉన్న టైమ్​లో వర్షం అడ్డుపడింది. వాన కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ నిలిచే సమయానికి బెంగళూరు 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. మరి.. కోహ్లీ బ్యాటింగ్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి