iDreamPost

నాకౌట్ మ్యాచ్​లో కోహ్లీ మరో రికార్డు.. కింగ్ డామినేషన్​ ఇలాగే ఉంటుంది!

  • Published May 18, 2024 | 10:02 PMUpdated May 18, 2024 | 10:08 PM

సీఎస్​కేతో జరుగుతున్న నాకౌట్ మ్యాచ్​లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. సూపర్బ్ నాక్​తో చెన్నై బౌలర్లను భయపెట్టాడు. తన డామినేషన్ ఎలా ఉంటుందో చూపించాడు.

ఐపీఎల్-2024లో అద్భుతమైన ఫామ్​లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఆరంభం నుంచే అదరగొడుతున్న కింగ్.. లీగ్ సెకండాఫ్​లో మరింత జోరందుకున్నాడు. అదే ఫామ్, జోరును చెన్నై సూపర్​కింగ్స్​తో జరుగుతున్న నాకౌట్ మ్యాచ్​లోనూ కంటిన్యూ చేశాడు. ఈ మ్యాచ్​లో 29 బంతుల్లో 47 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు కింగ్. అందులో 3 బౌండరీలతో పాటు 4 భారీ సిక్సులు ఉన్నాయి. స్కోరు బోర్డును పరుగులు పెట్టించడమే టార్గెట్​గా పెట్టుకొని బ్యాటింగ్ చేశాడతను. ఈ మ్యాచ్​తో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడీ ఆర్సీబీ స్టార్.

కోహ్లీ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్-2024లో అత్యధిక సిక్సులు (37) బాదిన ప్లేయర్​గా కింగ్ నిలిచాడు. అలాగే ఈ సీజన్​లో అత్యధిక బౌండరీలు కొట్టిన రెండో బ్యాటర్​గానూ నిలిచాడు. దీన్ని బట్టే ఈ ఐపీఎల్​లో కింగ్ డామినేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టాప్ స్కోరర్​గా ఉన్న కోహ్లీ.. బౌండరీలు, సిక్సుల్లోనూ టాప్​లో నిలిచాడు. తద్వారా తన బ్యాట్ పదును ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు. టీ20ల్లోనూ తాను ధీటుగా ఆడగలనని చూపించాడు. మరి.. కోహ్లీ క్రేజీ రికార్డుపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి