Nidhan
అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఆర్సీబీ. నమ్మశక్యం కాని రీతిలో అద్భుతమైన ఆటతీరుతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన డుప్లెసిస్ సేన.. నాకౌట్ ఫైట్‌లో చెన్నైని చిత్తు చేసింది. సీఎస్కేను చెప్పి మరీ కొట్టాడు కోహ్లీ.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఆర్సీబీ. నమ్మశక్యం కాని రీతిలో అద్భుతమైన ఆటతీరుతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన డుప్లెసిస్ సేన.. నాకౌట్ ఫైట్‌లో చెన్నైని చిత్తు చేసింది. సీఎస్కేను చెప్పి మరీ కొట్టాడు కోహ్లీ.
Nidhan
అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఆర్సీబీ. నమ్మశక్యం కాని రీతిలో అద్భుతమైన ఆటతీరుతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన డుప్లెసిస్ సేన.. నాకౌట్ ఫైట్‌లో చెన్నైని చిత్తు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో 27 పరుగుల తేడాతో సీఎస్కేను ఓడించింది బెంగళూరు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు ఓవర్లన్నీ ఆడి 218 పరుగులు చేసింది. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే సీఎస్కేను 200 పరుగులకే కట్టడి చేయాలి. అయితే ఆర్సీబీ దెబ్బకు 20 ఓవర్లకు 191 పరుగులే చేయగలిగింది చెన్నై. దీంతో 9 పరుగుల తేడాతో క్వాలిఫికేషన్ ఛాన్సులను మిస్ చేసుకుంది. సీఎస్కేను చెప్పి మరీ కొట్టాడు కింగ్ కోహ్లీ. ప్లేఆఫ్స్ గురించి ముందే స్టేట్మెంట్స్ ఇచ్చాడు.
ఇటీవల విమెన్స్ ప్రీమియర్ లీగ్ జరిగిన సందర్భంలో బెంగళూరు మహిళల జట్టు మొదట్లో ఓటములతో నిరాశపర్చింది. ఆ టైమ్‌లో వాళ్లను కలిశాడు కోహ్లీ. ఒక్కోసారి విజయానికి 1 శాతం అవకాశం ఉన్నా సరిపోతుందంటూ స్మృతి మంధాన, ఎలిస్ పెర్రీ సహా ఇతర ఆర్సీబీ ప్లేయర్లలో స్ఫూర్తిని నింపాడు. వన్ పర్సెంట్ ఛాన్స్‌ను మనం ఎలా చూస్తున్నామనేదే ముఖ్యమని అన్నాడు. దాన్ని పాజిటివ్ యాంగిల్లో చూస్తూ మన బెస్ట్ పెర్ఫార్మెన్స్ను బయటకు తీస్తే అదే ఒక్క శాతం క్రమంగా 10, 30, 50.. ఇలా పెరుగుతూ పోతుందన్నాడు. ఒక్కోసారి ఆ ఒక్క శాతంలో నుంచే అద్భుతం పుట్టుకొస్తుందన్నాడు కోహ్లీ. దాన్ని నమ్మాలి, మీరు చేయగలిగిందంతా చేస్తే చాలు.. మిగతాదంతా అదే జరుగుతుందన్నాడు విరాట్.
కోహ్లీ మాటల నుంచి స్ఫూర్తిని పొందిన ఆర్సీబీ విమెన్స్ టీమ్ ఈసారి డబ్ల్యూపీఎల్ కప్పు గెలిచింది. ఐపీఎల్-2024లో సీఎస్కేతో నాకౌట్ మ్యాచ్‌కు ముందు కూడా ఇవే కామెంట్స్‌ను రిపీట్ చేశాడు కింగ్. ఈ సీజన్లో ఒక దశలో వరుస ఓటములతో డీలా పడిపోయింది బెంగళూరు. ఒక దశలో ఆ టీమ్ ప్లేఆఫ్స్ ఛాన్సులు 1 శాతానికి పడిపోయాయి. అప్పుడు అంతా అయిపోయిందనుకొని బ్యాగులు కూడా సర్దుకొన్నానని.. అప్పుడే అద్భుతం జరిగిందన్నాడు. పోరాడదామని ఫిక్స్ అయ్యామని.. దూకుడు మంత్రంగా ఆడుతూ ఈ స్థాయికి చేరుకున్నామని విరాట్ చెప్పాడు. గెలుపుకు ఒక్క శాతం అవకాశం ఉన్నా వదలమని స్టేట్మెంట్ ఇచ్చాడు. కట్ చేస్తే చెన్నైని ఓడించి ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది ఆర్సీబీ. దీంతో చెప్పి మరీ కోహ్లీ సీఎస్కేను కొట్టాడని ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. విరాట్ 1 పర్సెంట్ థియరీపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.