iDreamPost

Virat Kohli: చెప్పి మరీ కొట్టిన కోహ్లీ.. ప్లేఆఫ్స్ గురించి ముందే స్టేట్మెంట్స్!

  • Published May 19, 2024 | 3:28 PMUpdated May 19, 2024 | 3:28 PM

అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఆర్సీబీ. నమ్మశక్యం కాని రీతిలో అద్భుతమైన ఆటతీరుతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన డుప్లెసిస్ సేన.. నాకౌట్ ఫైట్​లో చెన్నైని చిత్తు చేసింది. సీఎస్​కేను చెప్పి మరీ కొట్టాడు కోహ్లీ.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఆర్సీబీ. నమ్మశక్యం కాని రీతిలో అద్భుతమైన ఆటతీరుతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన డుప్లెసిస్ సేన.. నాకౌట్ ఫైట్​లో చెన్నైని చిత్తు చేసింది. సీఎస్​కేను చెప్పి మరీ కొట్టాడు కోహ్లీ.

  • Published May 19, 2024 | 3:28 PMUpdated May 19, 2024 | 3:28 PM
Virat Kohli: చెప్పి మరీ కొట్టిన కోహ్లీ.. ప్లేఆఫ్స్ గురించి ముందే స్టేట్మెంట్స్!

అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఆర్సీబీ. నమ్మశక్యం కాని రీతిలో అద్భుతమైన ఆటతీరుతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన డుప్లెసిస్ సేన.. నాకౌట్ ఫైట్​లో చెన్నైని చిత్తు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో 27 పరుగుల తేడాతో సీఎస్​కేను ఓడించింది బెంగళూరు. తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆతిథ్య జట్టు ఓవర్లన్నీ ఆడి 218 పరుగులు చేసింది. ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అవ్వాలంటే సీఎస్​కేను 200 పరుగులకే కట్టడి చేయాలి. అయితే ఆర్సీబీ దెబ్బకు 20 ఓవర్లకు 191 పరుగులే చేయగలిగింది చెన్నై. దీంతో 9 పరుగుల తేడాతో క్వాలిఫికేషన్​ ఛాన్సులను మిస్ చేసుకుంది. సీఎస్​కేను చెప్పి మరీ కొట్టాడు కింగ్ కోహ్లీ. ప్లేఆఫ్స్ గురించి ముందే స్టేట్​మెంట్స్ ఇచ్చాడు.

ఇటీవల విమెన్స్ ప్రీమియర్ లీగ్ జరిగిన సందర్భంలో బెంగళూరు మహిళల జట్టు మొదట్లో ఓటములతో నిరాశపర్చింది. ఆ టైమ్​లో వాళ్లను కలిశాడు కోహ్లీ. ఒక్కోసారి విజయానికి 1 శాతం అవకాశం ఉన్నా సరిపోతుందంటూ స్మృతి మంధాన, ఎలిస్ పెర్రీ సహా ఇతర ఆర్సీబీ ప్లేయర్లలో స్ఫూర్తిని నింపాడు. వన్ పర్సెంట్ ఛాన్స్​ను మనం ఎలా చూస్తున్నామనేదే ముఖ్యమని అన్నాడు. దాన్ని పాజిటివ్ యాంగిల్​లో చూస్తూ మన బెస్ట్ పెర్ఫార్మెన్స్​ను బయటకు తీస్తే అదే ఒక్క శాతం క్రమంగా 10, 30, 50.. ఇలా పెరుగుతూ పోతుందన్నాడు. ఒక్కోసారి ఆ ఒక్క శాతంలో నుంచే అద్భుతం పుట్టుకొస్తుందన్నాడు కోహ్లీ. దాన్ని నమ్మాలి, మీరు చేయగలిగిందంతా చేస్తే చాలు.. మిగతాదంతా అదే జరుగుతుందన్నాడు విరాట్.

కోహ్లీ మాటల నుంచి స్ఫూర్తిని పొందిన ఆర్సీబీ విమెన్స్ టీమ్ ఈసారి డబ్ల్యూపీఎల్ కప్పు గెలిచింది. ఐపీఎల్-2024లో సీఎస్​కేతో నాకౌట్ మ్యాచ్​కు ముందు కూడా ఇవే కామెంట్స్​ను రిపీట్ చేశాడు కింగ్. ఈ సీజన్​లో ఒక దశలో వరుస ఓటములతో డీలా పడిపోయింది బెంగళూరు. ఒక దశలో ఆ టీమ్ ప్లేఆఫ్స్​ ఛాన్సులు 1 శాతానికి పడిపోయాయి. అప్పుడు అంతా అయిపోయిందనుకొని బ్యాగులు కూడా సర్దుకొన్నానని.. అప్పుడే అద్భుతం జరిగిందన్నాడు. పోరాడదామని ఫిక్స్ అయ్యామని.. దూకుడు మంత్రంగా ఆడుతూ ఈ స్థాయికి చేరుకున్నామని విరాట్ చెప్పాడు. గెలుపుకు ఒక్క శాతం అవకాశం ఉన్నా వదలమని స్టేట్మెంట్ ఇచ్చాడు. కట్ చేస్తే చెన్నైని ఓడించి ప్లేఆఫ్స్​లోకి అడుగు పెట్టింది ఆర్సీబీ. దీంతో చెప్పి మరీ కోహ్లీ సీఎస్​కేను కొట్టాడని ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. విరాట్ 1 పర్సెంట్ థియరీపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి