కోహ్లీ నయా హిస్టరీ.. ఊరికే కింగ్ అవ్వలేదు.. ఈ లెక్కలు చూడండి!

PBKS vs RCB- Virat Kohli New History: ఇండయన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆర్సీబీ పోరాటం ముగిసినా.. ప్రత్యర్థుల మీద విరాట్ కోహ్లీ యుద్ధం మాత్రం ముగిసేట్టు లేదు. పంజాబ్ మీద కింగ్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు.

PBKS vs RCB- Virat Kohli New History: ఇండయన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆర్సీబీ పోరాటం ముగిసినా.. ప్రత్యర్థుల మీద విరాట్ కోహ్లీ యుద్ధం మాత్రం ముగిసేట్టు లేదు. పంజాబ్ మీద కింగ్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రన్ మెషిన్ కింగ్ కోహ్లీ పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆర్సీబీ జట్టు ప్రదర్శన మొత్తం ఒకెత్తు అయితే.. విరాట్ కోహ్లీ ప్రదర్శన మరో ఎత్తనే చెప్పాలి. ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు అయినా.. విరాట్ మాత్రం ప్రత్యర్థులపై తన పోరాటాన్ని ఆపడం లేదు. ఈ సీజన్ లో కూడా కోహ్లీ ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టాడు. తాజాగా మరో అరుదైన ఘనతని తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాలోనే కాకుండా.. ఐపీఎల్ లో కూడా విరాట్ కోహ్లీ కింగ్ అనే విషయాన్ని మరోసారి గుర్తు చేశాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విజృంభించాడు.

ధర్మశాల వేదకగా పంజాబ్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టుకు ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా విరాట్ కోహ్లీ- రజత్ పాటిదార్ విజృంభించారు. పాటిదార్ ఈ మ్యాచ్ లో కూడా అర్ధ శతకం నమోదు చేశాడు. మొత్తం 23 బంతుల్లో 6 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో ఏకంగా 55 పరుగులు చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ అయితే విశ్వరూపం దాల్చాడు. పంజాబ్ బౌలర్లకు ఎక్కడా ఆస్కారం లేకుండా చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో కూడా కోహ్లీ చెలరేగి ఆడాడు. ఇప్పటికే ఈ సీజన్లో 5 అర్ధ శతకాలు నమోదు చేసిన కోహ్లీ.. ఈ మ్యాచ్ లో కూడా అర్ధ శతకాన్ని దాటేశాడు.

విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఐపీఎల్లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. కానీ, ఈ సీజన్లో మరో స్పెషల్ రికార్డును సమం చేశాడు. అదేంటంటే.. ఒక ఐపీఎల్ సీజన్ లో 600+ పరుగులు చేయడం. ఇప్పటికే కేఎల్ రాహుల్ నాలుగుసార్లు ఈ ఘనతను సాధించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆ రికార్డును సమయం చేశాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఆ ఫీట్ ను సాధించాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ పంజాబ్ జట్టు మీద 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇండిన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మరో టీమ్ మీద వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.

అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ- రజత్ పాటిదార్ రెచ్చిపోయారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 92 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ శతకం చేస్తాడని భావించిన ఫ్యాన్స్ కి మాత్రం నిరాశ తప్పలేదు. కేవలం 8 పరుగుల తేడాతో కోహ్లీ అద్భుతమైన శతకాన్ని మిస్ చేసుకున్నాడు. మరి.. విరాట్ కోహ్లీ సాధించిన ఈ ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments