iDreamPost
android-app
ios-app

వీడియో: పంజాబ్ విజయం.. ఆనందం పట్టలేకపోయిన ప్రీతిజింటా చూడండి..

PBKS vs DC- Preity Zinta: పంజాబ్ కింగ్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విన్ తర్వాత ప్రీతి జింటా సెలబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

PBKS vs DC- Preity Zinta: పంజాబ్ కింగ్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విన్ తర్వాత ప్రీతి జింటా సెలబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

వీడియో: పంజాబ్ విజయం.. ఆనందం పట్టలేకపోయిన ప్రీతిజింటా చూడండి..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రెండో మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగానే సాగింది. ఢిలీ క్యాపిటల్స్- పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన పోరు విజయం నీదా నాదా అన్నట్లుగానే సాగింది. మొదట వికెట్లు కోల్పోయిన ఢిల్లీ తర్వాత పుంజుకుని గౌరవప్రదమైన స్కోర్ చేసింది. మరోవైపు పంజాబ్ కూడా మెరుపులు మెరిపిస్తూ.. మధ్యలో వికెట్లు కోల్పోతో కాస్త ఫ్యాన్స్ ని కంగారు పెట్టింది. కానీ, చివరకి మాత్రం పంజాబ్ 4 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ప్రీతిజింటా మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. తన టీమ్ గెలిచిన తర్వాత ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించిన సామ్ కరణ్ కంటే ఇప్పుడు ప్రీతిజింటా సెలబ్రేషనే వైరల్ అవుతోంది.

సాధారణంగా పంజాబ్ టీమ్ కి మ్యాచ్ ఉంది అంటే.. ఒక కెమెరామ్యాన్ కచ్చితంగా ప్రీతిజింటాపై ఫోకస్ చేసి ఉంటాడు. ఈ మ్యాచ్ లో కూడా ప్రీతిజింటానే వైరల్ అవుతూ వచ్చింది. పంజాబ్ బ్యాటర్ సిక్సు కొట్టినా.. పంజాబ్ బౌలర్ వికెట్ తీసినా ప్రీతిజింటా ఆనందంతో ఊగిపోతుంది. ఐపీఎల్ 2024 పంజాబ్ తొలిమ్యాచ్ లో కూడా ప్రీతిజింటానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. పంజాబ్ విజయం సాధించిన తర్వాత ప్రీతి ఆనందాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఆమె నవ్వుతూ ప్లేయర్లకు ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ సంబరాలు చేసుకుంది. ప్రీతిజింటా సెలబ్రేషన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి.

PBKS

ఈరోజు ప్రీతిజింటా అప్పియరెన్స్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉంది. పంజాడీ డ్రెస్ లో వచ్చిన ప్రీతి పిక్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్లో పంజాబ్ మ్యాచ్ అంటే చాలామంది ప్రీతి కోసమే చూస్తారు అనే టాక్ కూడా ఉంది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ ఫస్ట్ నుంచి ఢిల్లీ జట్టును ఇబ్బంది పెడుతూనే వచ్చింది. మొదట వార్నర్(29), మిచెల్ మార్ష్(20) దూకుడు ప్రదర్శించినా కూడా తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చారు. షాయ్ హోప్(33) కాసేపు కంగారు పెట్టినా కూడా రబాడా పెవిలియన్ కి పంపేశాడు. పంత్ కూడా క్రీజులో ఎక్కువసేపు ఉండలేకపోయాడు. గాడిలో పడుతున్నాడు అనుకునే సమయంలో హర్షల్ పటేల్ బౌలింగ్ లో ఔట్ అయిపోయాడు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్(32) జట్టుకు మంచి స్కోర్ అందేలా చేశాడు.

పంజాబ్ బౌలింగ్ లో మెరుపులు మెరిపించింది. అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ కు చెరో రెండు వికెట్లు పడ్డాయి. రబాడా, బ్రార్, రాహుల్ చాహర్ లకు తలో వికెట్ దక్కింది. ఇంక పంజాబ్ అయితే బ్యాటింగ్ లో కాస్త తడబడింది. నిజానికి మ్యాచ్ పోతుందనే కంగారు కూడా ఫ్యాన్స్ లో కనిపించింది. కానీ, సామ్ కరణ్(63) మెరుపు ఇన్నింగ్స్ పంజాబ్ కు ఈ విజయాన్ని అందించింది. లివింగ్ స్టోన్(38) నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి ఐపీఎల్ 2024లో పంజాబ్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. మరి.. ప్రీతిజింటా నవ్వులకు కారణైన సామ్ కరణ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.