ఆ విషయంలో ధోని డ్రామాలాడుతున్నాడు.. ఆసీస్ లెజెండ్ షాకింగ్ కామెంట్స్!

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని డ్రామాలు ఆడుతున్నాడని ఓ ఆసీస్ లెజెండ్ అన్నాడు. ఆ విషయంలో అనవసర రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని డ్రామాలు ఆడుతున్నాడని ఓ ఆసీస్ లెజెండ్ అన్నాడు. ఆ విషయంలో అనవసర రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో ఆసక్తికర పోరుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​కు వెళ్లాలంటే తన ఆఖరి మ్యాచ్​లో ఆర్సీబీపై నెగ్గాల్సిన సిచ్యువేషన్​లో ఉంది సీఎస్​కే. ఈ నేపథ్యంలో బెంగళూరుతో మ్యాచ్​లో తన అనుభవాన్ని అంతా రంగరించి ఎల్లో ఆర్మీని గట్టెక్కించాలని చూస్తున్నాడు మాహీ. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్​కు అండగా ఉంటూ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇన్నాళ్లూ ఆఖర్లో బ్యాటింగ్​కు వస్తూ దుమ్మురేపిన ధోని.. ప్లేఆఫ్స్​ వెళ్లాలంటే గెలవక తప్పదు కాబట్టి, ఆర్సీబీతో పోరులో కాస్త ముందుకు వచ్చి బ్యాటింగ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో అతడి గురించి ఆసీస్ లెజెండ్ మైక్ హస్సీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఆ విషయంలో ధోని డ్రామాలాడుతున్నాడని హస్సీ అన్నాడు. దాని గురించి క్లారిటీ ఇవ్వాల్సింది మాహీయేనని.. అది అతడి చేతుల్లోనే ఉందన్నాడు. ఏ విషయంలో ధోని గురించి హస్సీ ఇలా అన్నాడనేగా మీ డౌట్. తన రిటైర్మెంట్ విషయంలో సీఎస్​కే మాజీ సారథి వ్యవహరిస్తున్న తీరుపై హస్సీ సీరియస్ అయ్యాడు. రిటైర్మెంట్ గురించి తేల్చుకుండా అతడు డ్రామాలు ఆడుతున్నాడని చెప్పాడు. ధోని ఇంకొన్నాళ్లు ఐపీఎల్​లో కొనసాగే అవకాశం కనిపిస్తోందని అన్నాడు. అతడి తీరు చూస్తుంటే ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించకపోవచ్చని పేర్కొన్నాడు. ఏ విషయమైనా వెంటనే బయటపెట్టడం ధోనీకి అలవాటు లేదన్నాడు. దేన్నైనా రహస్యంగా ఉంచడం అతడికి మామూలేనని వ్యాఖ్యానించాడు.

‘ధోని ఇంకా బాగా ఆడుతున్నాడు. అతడి బ్యాట్ ఈ సీజన్​లో గర్జిస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా బరిలోకి దిగి భారీ సిక్సులు బాదుతున్నాడు. గత ఐపీఎల్​లో అతడి మోకాలుకు సర్జరీ అయింది. దాని నుంచి పూర్తిగా కోలుకోలేదు. అయినా మ్యానేజ్ చేస్తూ వస్తున్నాడు. ధోని ఆడుతున్న తీరు చూస్తుంటే ఇంకొన్నేళ్ల పాటు ఈజీగా కెరీర్​ను కంటిన్యూ చేస్తాడని అనిపిస్తోంది. కానీ ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. తన రిటైర్మెంట్ గురించి ఆలోచించి నిర్ణయం ప్రకటించాల్సింది మాహీనే. కానీ అతడు ఏదీ ఓ పట్టాన చెప్పడు. ప్రతి దాని చుట్టూ డ్రామా క్రియేట్ చేయడం అతడికి ఇష్టం. అతడి వ్యవహారం చూస్తుంటే ఇప్పుడప్పుడే గేమ్​కు గుడ్​బై చెప్పేలా అనిపించడం లేదు’ అని హస్సీ స్పష్టం చేశాడు. మరి.. రిటైర్మెంట్ విషయంలో ధోని డ్రామాలు ఆడుతున్నాడంటూ హస్సీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments