Tirupathi Rao
MI vs LSG- Arjun Tendulkar: ముంబయి- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో లిటిల్ మాస్టర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ కు అవకాశం కల్పించారు. అద్భుతమైన బౌలింగ్ తో అర్జున్ టెండుల్కర్ అందరి ప్రశంసలు పొందాడు. కానీ, ఓవర్ మధ్యలోనే బౌలింగ్ ఆపేసి వెళ్లిపోయాడు.
MI vs LSG- Arjun Tendulkar: ముంబయి- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో లిటిల్ మాస్టర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ కు అవకాశం కల్పించారు. అద్భుతమైన బౌలింగ్ తో అర్జున్ టెండుల్కర్ అందరి ప్రశంసలు పొందాడు. కానీ, ఓవర్ మధ్యలోనే బౌలింగ్ ఆపేసి వెళ్లిపోయాడు.
Tirupathi Rao
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో దాదాపుగా లీగ్ దశ ముగియనుంది. తాజాగా ముంబయి ఇండియన్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నామమాత్రపు మ్యాచ్ జరిగింది. నామమాత్రం ఎందుకంటే ముంబయి ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయింది. లక్నో కూడా దాదాపుగా ఎలిమినేషన్ కు అంచుల్లో ఉంది. చెన్నై ఓడి.. ఆర్సీబీ గెలిస్తే.. ముంబయి మీద లక్నో విజయం సాధిస్తే.. ఆర్సీబీ- లక్నో 14 పాయింట్లతో ఉంటారు. కానీ, అప్పుడు లక్నోకి నెట్ రన్ రేట్ సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే ముంబయి జట్టు మీద లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ ఫాస్ట్ ఇన్నింగ్స్ ఆడుతోంది. బౌండరీలు మీద బౌండరీలు బాదేస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో అర్జున్ టెండుల్కర్ ఓవర్ మధ్యలోనే వెళ్లిపోయాడు.
ముంబయి జట్టు ఈ సీజన్ లో తమ ఆఖరి పోరులో లిటిల్ మాస్టర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ కు అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని జూనియర్ టెండుల్కర్ కూడా సద్వినియోగం చేసుకున్నట్లే కనిపించింది. మొదటి 2 ఓవర్స్ ఎంతో అద్భుతంగా వేశాడు. 2 ఓవర్స్ లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పైగా ఈ మ్యాచ్ లో ఎంతో అగ్రెసివ్ గా కూడా కనిపించాడు. కానీ, ఆ అగ్రెషన్- దూకుడు ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే మూడో ఓవర్ వేస్తున్న అర్జున్ టెండుల్కర్ మొదటి 2 బంతులు వేసిన తర్వాత ఓవర్ మధ్యలోనే ఆపేసి డగౌట్ లో కూర్చున్నాడు. ముంబయి ఫ్యాన్స్ అసలు ఏం జరిగింది అని కాస్త కంగారు పడ్డారు.
Aggression from Arjun Tendulkar.
Reaction of Marcus Stoinis. pic.twitter.com/dzOWXtJPaM
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 17, 2024
విషయం ఏంటంటే.. అర్జున్ టెండుల్కర్ తన స్పెల్ లోని మూడో ఓవర్లో మొదటి 2 బంతులను పూరన్ భారీ భారీ సిక్సులు కొట్టేశాడు. అప్పిటికే అర్జున్ టెండుల్కర్ కు ఏదో గాయం అయినట్లు కనిపించింది. అప్పటికే మొదటి రెండు బంతులను ఫుల్ టాస్ గా వేశాడు. ఆ తర్వాత గాయానికి గురయ్యాడు. వెళ్లి డగౌట్ లో కూర్చున్నాడు. అర్జున్ టెండుల్కర్ కాస్త ఇబ్బంది పడుతున్నట్లే కనిపించాడు. ఫిజియో వెళ్లి అర్జున్ టెండుల్కర్ ని పరిశీలించాడు. అర్జున్ టెండుల్కర్ స్థానంలో రోహిత్ శర్మ మైదానంలోకి అడుగుపెట్టాడు. అది మరీ పెద్ద గాయం కాకూడదు అని ముంబయి ఫ్యాన్స్ అంతా ఆకాంక్షిస్తున్నారు. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ లక్ష్యం దిశగా అడుగులు వేసింది. కానీ, వారి జోరుకు కాస్త బ్రేకులు పడ్డాయి. పూరన్(75) అవుటైన్ తర్వాత స్కోర్ బోర్డు కాస్త నెమ్మదించింది. కెప్టెన్ రాహుల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మరి.. అర్జున్ టెండుల్కర్ కు గాయం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Nicholas Pooran – the cleanest striker! pic.twitter.com/a3YHbCLTUo
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 17, 2024