IPLలో పదేళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన జేక్ ఫ్రేజర్.. రైనా తర్వాత..!

MI vs DC- Jake Fraser Mcgurk: ఢిల్లీ క్యాపిటల్స్- ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో జేక్ ఫ్రేజర్ మరోసారి సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో కొన్ని అరుదైన రికార్డులు కూడా బద్దలు కొట్టాడు.

MI vs DC- Jake Fraser Mcgurk: ఢిల్లీ క్యాపిటల్స్- ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో జేక్ ఫ్రేజర్ మరోసారి సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో కొన్ని అరుదైన రికార్డులు కూడా బద్దలు కొట్టాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎంతో ఆసక్తిగా సాగుతోంది. ముఖ్యంగా ఈ సీజన్లో భారీ భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. ఆఖరి 10 మ్యాచుల్లో 9 సార్లు స్కోర్ బోర్డు 200 పరుగులు అంతకంటే ఎక్కువ నమోదు అయ్యాయి. అలాగే కొత్త కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఐపీఎల్లో ఉన్న రికార్డులు బద్దలవుతున్నాయి. తాజాగా ఢీల్లీ క్యాపిటల్స్- ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో కూడా అలాంటి సీన్సే ఎక్కువ కనిపించాయి. ముఖ్యంగా జేక్ ఫ్రేజర్ సునామీ ఇన్నింగ్స్ కి అంతా ఫిదా అయిపోయారు. అలాగే జేక్ ఫ్రేజర్ కూడా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టాడు. వాటిలో ఒకటి మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి.

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా చిచ్చర పిడుగు జేక్ ఫ్రేజర్ పేరు మారుమోగుతోంది. ఢిల్లీ జట్టులో ఈ యూవ డైనమైట్ దెబ్బకు వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా అల్లాడి పోతున్నారు. అతనికి ఎక్కడ బాల్ వేసినా కూడా దానిని సునాయాసంగా బౌడరీగా మార్చేస్తున్నాడు. బుమ్రాలాంటి మేటి బౌలర్లకు కూడా ఫ్రేజర్ ను అవుట్ చేయాలి అంటే పెద్ద సవాలుగా మారుతోంది. ముంబయితో జరిగిన మ్యాచ్ లో కూడా జేక్ ఫ్రేజర్ అద్భుతంగా రాణించాడు. కేవలం 27 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 84 పరుగులు నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడమే కాకుండా.. ఎన్నో రికార్డులు కూడా బద్దలు కొట్టాడు.

ముఖ్యంగా ఐపీఎల్ హిస్టరీలో పదేళ్ల తర్వాత ఒక రికార్డును జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ బ్రేక్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో 15 బంతుల్లో ఫ్రేజర్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. మళ్లీ అదే తరహాలో ముంబయి మీద కూడా ఢిల్లీ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు. అయితే ఈ సారి అర్ధ శతకం కాస్త స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈసారి 300కి పైగా స్ట్రైక్ రేట్ తో ఫ్రేజర్ ఈ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ఐపీఎల్లో ఏదైనా మ్యాచ్ లో 20కి పైగా బాల్స్ ఎదుర్కొని 300+ స్ట్రైక్ రేట్ మెయిన్ టైన్ చేయడం రికార్డుగా చెప్తున్నారు.

2014వ సీజన్లో ఆ ఘనతను సురేశ్ రైనా, యూసుఫ్ పఠాన్ అందుకున్నారు. మళ్లీ పదేళ్ల తర్వాత ఆసీస్ డైనమైట్ జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ ఈ రికార్డును ముంబయి మ్యాచ్ లో అందుకున్నాడు. 311.11 స్ట్రైక్ రేట్ తో ఈ మ్యాచ్ లో ఏకంగా 84 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. పవర్ ప్లేలో అత్యధిక పరుగులు కూడా నమోదు చేశాడు. 2009లో ఆడమ్ గిల్ క్రిస్ట్ 74 పరుగులు చేశాడు. ఆ రికార్డును ఈ మ్యాచ్ లో జేక్ ఫ్రేజర్ బద్దలు కొట్టాడు. ముంబయితో మ్యాచ్ లో ఫ్రేజర్ 78 పరుగులు చేసి ఆడమ్ గిల్ క్రిస్ట్ ని దాటేశాడు.

Show comments