Nidhan
జస్ప్రీత్ బుమ్రా పేరు చెబితే టాప్ బ్యాటర్లు కూడా భయపడతారు. అతడి బౌలింగ్‌లో పరుగులు చేయడం పక్కనబెడితే వికెట్ పోకుండా ఉంటే చాలని భావిస్తారు. అలాంటి పేసుగుర్రాన్ని అతడు వణికించాడు.
జస్ప్రీత్ బుమ్రా పేరు చెబితే టాప్ బ్యాటర్లు కూడా భయపడతారు. అతడి బౌలింగ్‌లో పరుగులు చేయడం పక్కనబెడితే వికెట్ పోకుండా ఉంటే చాలని భావిస్తారు. అలాంటి పేసుగుర్రాన్ని అతడు వణికించాడు.
Nidhan
జస్ప్రీత్ బుమ్రా పేరు చెబితే టాప్ బ్యాటర్లు కూడా భయపడతారు. అతడి బౌలింగ్‌లో పరుగులు చేయడం పక్కనబెడితే వికెట్ పోకుండా ఉంటే చాలని భావిస్తారు. గత కొన్నేళ్లలో తన బౌలింగ్‌ను ఎంతో మెరుగుపర్చుకున్న బుమ్రా.. ఇప్పుడు వరల్డ్ క్రికెట్లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ అతడి హవా నడుస్తోంది. టీ20లు, వన్డేలు, టెస్టులు.. ఇలా ఫార్మాట్‌కు తగ్గట్లు లెంగ్త్‌లు మారుస్తూ, బాల్ వేగంలో మార్పులు, వేరియేషన్స్‌తో బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు బుమ్రా. అతడి బౌలింగ్‌లో ఎంతటి టాప్ బ్యాటర్‌కైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అద్భుతమైన యార్కర్లు, రాకాసి బౌన్సర్లు, విచిత్రమైన స్లో డెలివరీస్‌తో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. కానీ అలాంటి పేసుగుర్రాన్ని ఒకడు వణికించాడు.
బ్యాటర్లకు సింహస్వప్నంగా మారిన బుమ్రాకు ఓ బ్యాటర్ అంటే మాత్రం భయం. అతడికి ఎలా బౌలింగ్ చేయాలో పేసుగుర్రానికి అర్థం కావడం లేదు. భీకరమైన వేగంతో కట్టుదిట్టమైన బంతులు వేసినా అలవోకగా పరుగులు చేసేస్తున్నాడు. బుమ్రాను అంతగా ఇబ్బంది పెడుతున్న ఆ బ్యాట్స్‌మన్ మరెవరో కాదు.. టీమిండియా సీనియర్ ప్లేయర్ మనీష్ పాండే. స్టైలిష్ బ్యాటింగ్‌తో అందర్నీ ఆకట్టుకునే మనీష్.. బుమ్రా బౌలింగ్ అంటే చాలు రెచ్చిపోతాడు. బాల్ మెరిట్‌ను బట్టి అతడి బౌలింగ్‌లో షాట్లు ఆడతాడు. ముందే షాట్లు కమిట్ అవ్వకుండా బాల్ లెంగ్త్, వెళ్తున్న దిశ, స్వింగ్, వేగం తదితరాలు గమనించి కరెక్ట్ టైమ్‌లో పర్ఫెక్ట్గా అంచనా వేసి షాట్లు కొడతాడు.
టీ20 క్రికెట్లో బుమ్రా బౌలింగ్‌లో ఇప్పటిదాకా 42 బంతుల్ని ఫేస్ చేసిన మనీష్ పాండే 80 పరుగులు చేశాడు. ఇందులో 10 బౌండరీలు సహా 2 సిక్సులు కూడా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఏస్ పేసర్ బౌలింగ్‌లో 190.5 స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేశాడు. ఒక్కసారి కూడా మనీష్‌ను ఔట్ చేయలేకపోయాడు బుమ్రా. మనీష్ కెరీర్లో చాలా పరుగులు చేశాడు. తోపు బౌలర్లను కూడా చితగ్గొట్టాడు. కానీ వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న బుమ్రాపై సాధించినంత ఆధిపత్యం ఎవరి మీదా చూపించలేదు. అది కూడా బుమ్రా కెరీర్ ఇప్పుడు పీక్‌లో ఉంది. ఈ సమయంలో అతడ్ని వీరబాదుడు బాదడం అంటే మాటలు కాదు. పాండ్యా కెరీర్లో ఈ ఘనత ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి. మరి.. బుమ్రాను మనీష్ సులువుగా ఆడేయడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Manish Pandey vs Jasprit Bumrah in T20s:
– 80 runs
– 42 balls
– 10 fours
– 2 sixes
– 190.5 strike rate
– 0 outsA proud record to cherish for Manish Pandey in his career. 🤯 pic.twitter.com/4kBFtst2uo
— Johns. (@CricCrazyJohns) May 4, 2024
WHAT A SHOT BY MANISH PANDEY AGAINST BUMRAH. 🤯 pic.twitter.com/wPhkgkp7eg
— Johns. (@CricCrazyJohns) May 3, 2024