Nidhan
ఈసారి ఐపీఎల్లో స్టార్ ప్లేయర్స్ కంటే కొందరు అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఎక్కువ హైలైట్ అవుతున్నారు. దీనికి కారణం వాళ్ల గేమ్ అనే చెప్పాలి. కోట్లు తీసుకునే స్టార్ల కంటే వీళ్ల ఆటతీరే తోపు లెవల్లో ఉంది. ఎవరా ప్లేయర్లు అనేది ఇప్పుడు చూద్దాం..
ఈసారి ఐపీఎల్లో స్టార్ ప్లేయర్స్ కంటే కొందరు అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఎక్కువ హైలైట్ అవుతున్నారు. దీనికి కారణం వాళ్ల గేమ్ అనే చెప్పాలి. కోట్లు తీసుకునే స్టార్ల కంటే వీళ్ల ఆటతీరే తోపు లెవల్లో ఉంది. ఎవరా ప్లేయర్లు అనేది ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఫ్రాంచైజీ క్రికెట్లో స్టార్ ప్లేయర్లకు ఉండే డిమాండ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ల కోసం టీమ్స్ ఎగబడతాయి. ఆక్షన్‌లో కోట్లకు కోట్లు పోసి మరీ కొనుక్కుంటాయి. అభిమానులు కూడా ఇలాంటి ఆటగాళ్ల మీద బోలెడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. జట్టుకు కప్పు అందిస్తారని ఆశిస్తారు. అయితే డొమెస్టిక్ ప్లేయర్లను మాత్రం పెద్దగా ఎవరూ పట్టించుకోరు. వాళ్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప ఫోకస్‌లోకి రారు. అదే టైమ్‌లో అన్క్యాప్డ్ ఆటగాళ్లకు వచ్చే ఛాన్సులూ తక్కువే. అందుకే వారి మీద ఎవరికీ పెద్దగా అంచనాలు ఉండవు. అయితే అలాంటి ఆటగాళ్లే ఈసారి ఐపీఎల్లో అదరగొడుతున్నారు. కోట్లు తీసుకునే స్టార్స్ కంటే వీళ్లే తోపులుగా మారారు. టీమ్స్‌ను సింగిల్ హ్యాండ్‌తో గెలిపిస్తున్న ఆ టాప్-5 డొమెస్టిక్ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఒకప్పుడు చెత్త ఆటతీరుతో ఓవరాక్షన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్. క్యాచ్ పట్టినా, సిక్స్ కొట్టినా గ్రౌండ్లో డ్యాన్సులు వేస్తూ.. బిల్డప్ ఎక్కువ, బిజెనస్ తక్కువంటూ ట్రోలింగ్‌కు గురయ్యాడు. అయితే తన బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టిన రియాన్.. గత ఏడాది కాలంలో ఎంతో పరిణతి సాధించాడు. ఈ సీజన్లో బ్యాట్‌తో చెలరేగుతూ రాజస్థాన్ విజయాల్లో కీలకంగా మారాడు. ఆడిన మూడు మ్యాచుల్లో 2 ఫిఫ్టీలు బాదిన పరాగ్.. ఓవరాల్‌గా 181 రన్స్‌తో లీడింగ్ రన్ స్కోరర్ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.
తమిళనాడు ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన సాయి సుదర్శన్.. ఈసారి గుజరాత్ టైటాన్స్‌కు అతిపెద్ద బలంగా మారాడు. ఇతడ్ని వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కే దక్కించుకుంది జీటీ. ఈ సీజన్లో బ్యాట్‌తో రఫ్ఫాడిస్తున్న ఈ లెఫ్టాండర్ ఆడిన 4 మ్యాచుల్లో 160 పరుగులు చేశాడు. మిడిల్ ఓవర్లలో ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే వేగంగా పరుగులు చేస్తూ టీమ్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు సాయి. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్స్ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడతను.
ఒకే ఒక్క మ్యాచ్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు లక్నో ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్. ఇతడ్ని వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కే దక్కించుకుంది లక్నో. నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో అతడు వేస్తున్న బంతుల్ని ఎదుర్కొనేందుకు టాప్ బ్యాటర్స్ కూడా వణుకుతున్నారు. వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్నాడు మయాంక్. ఎల్ఎస్జీకి తురుపుముక్కగా మారిన ఈ పేసర్.. 6 వికెట్లతో పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో 3వ ప్లేస్‌లో ఉన్నాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు హర్షిత్ రాణా. ఇతడ్ని వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కే దక్కించుకుంది కేకేఆర్. స్లో బౌన్సర్స్, కట్టర్స్, యార్కర్స్‌తో బ్యాటర్లను ఎక్కడికక్కడ కట్టిపడేస్తున్నాడు రాణా. ఆడిన మూడు మ్యాచుల్లో 5 వికెట్లు తీశాడు. టీమ్‌కు ఎప్పుడు బ్రేక్ త్రూ కావాలన్నా తాను ఉన్నానంటూ ముందుకొస్తున్నాడీ యంగ్‌స్టర్.
యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్‌లో కీలకంగా మారాడు. ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేస్తూ అపోజిషన్ టీమ్స్‌ను భయపెడుతున్నాడీ హార్డ్ హిట్టర్. లెజెండ్ యువరాజ్ శిష్యుడు అయిన అభిషేక్.. బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. మూడు మ్యాచుల్లో 124 రన్స్ చేశాడు. ముంబై ఇండియన్స్ మీద 18 బంతుల్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదేశాడు.