IPL పరువు తీస్తున్న అంపైర్లు! ఒకటి, రెండు కాదు.. లెక్కకు మించి తప్పులు

ఈసారి ఐపీఎల్​లో ఆట కంటే కూడా వివాదాలు ఎక్కువైపోయాయి. వీటిల్లో ఎక్కువ మటుకు అంపైరింగ్ తప్పిదాల వల్ల జరుగుతున్నవేనని చెప్పాలి.

ఈసారి ఐపీఎల్​లో ఆట కంటే కూడా వివాదాలు ఎక్కువైపోయాయి. వీటిల్లో ఎక్కువ మటుకు అంపైరింగ్ తప్పిదాల వల్ల జరుగుతున్నవేనని చెప్పాలి.

ఈసారి ఐపీఎల్​లో ఆట కంటే కూడా వివాదాలు ఎక్కువైపోయాయి. ప్రతి మూడ్నాలుగు మ్యాచులకు ఏదో ఓ కాంట్రవర్సీ అవుతోంది. ఒక్కోసారి ఆటగాళ్లు, మరికొన్ని సార్లు కోచ్​లు కూడా గొడవకు దిగుతున్న సందర్భాలు చూస్తున్నాం. అయితే పైకి ఇవి ప్లేయర్లు, కోచ్​లు చేస్తున్న ఫైట్లలా కనిపిస్తున్నా.. వీటికి కారణం అంపైర్లేనని చెప్పాలి. ఐపీఎల్-2024లో అంపైరింగ్ మిస్టేక్స్​ భారీగా పెరిగాయి. ఈజీ ఔట్లను నాటౌట్ ఇవ్వడం, నాటౌట్​ను ఔట్ ఇచ్చేయడం, రనౌట్ అయినా ఇవ్వకపోవడం.. ఇలా చెత్త నిర్ణయాలతో లీగ్ పరువు తీస్తున్నారు అంపైర్లు. ఒకటి, రెండు కాదు.. లెక్కకు మించి తప్పిదాలు చేస్తున్నారు.

క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్​లో అంపైరింగ్ ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. లేటెస్ట్​గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఔట్ బిగ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో 46 బంతుల్లో 86 పరుగులు చేసిన సంజూ తన టీమ్​ను గెలిపించాలనే పట్టుదలతో ఆడుతున్న టైమ్​లో అంపైర్ నిర్ణయం వల్ల అతడు బలయ్యాడు. ముకేశ్ కుమార్ ఓవర్​లో అతడు కొట్టిన షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బౌండరీ లైన్ దగ్గర హోప్ క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ టైమ్​లో ఫీల్డర్ బౌండరీ లైన్​ను తొక్కినట్లు క్లియర్​గా కనిపిస్తున్నా సంజూను ఔట్​గా ప్రకటించారు. రాజస్థాన్ మ్యాచ్​లో ఓడిపోవడానికి ఈ నిర్ణయమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

ఇదే రాజస్థాన్ టీమ్​కు, సన్​రైజర్స్ హైదరాబాద్​కు జరిగిన మ్యాచ్​లో ట్రావిస్ హెడ్ రనౌట్ అయ్యాడు. సంజూ వేసిన త్రో వికెట్లను గిరాటేసింది. అప్పటికి హెడ్ బ్యాట్ క్రీజు లోపలే ఉన్నా గాల్లో ఉంది. అది నేలను తాకలేదు. అయినా అంపైర్ నాటౌట్ అని ప్రకటించారు. ఇక, ఈ ఐపీఎల్​లో మోస్ట్ కాంట్రవర్షియల్ ఔట్​గా విరాట్ కోహ్లీని చెప్పొచ్చు. కోల్​కతా నైట్ రైడర్స్​తో మ్యాచ్​లో హర్షిత్ రాణా వేసిన బీమర్​కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు కోహ్లీ. ఆ బంతిని క్రీజు దాటి ముందుకొచ్చి ఆడాడు విరాట్. బాల్ అతడి నడుము కంటే ఎత్తులో ఉంది. అయినా బాల్ డిప్ అవుతుందనే కారణంతో అతడ్ని ఔట్​గా ప్రకటించారు. బీమర్ వేసినందుకు బౌలర్​తో కనీసం సారీ కూడా చెప్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కోహ్లీ ఔటైన అదే మ్యాచ్​లో ఒక బౌండరీ విషయంలోనూ అంపైరింగ్ నిర్ణయం ఆర్సీబీకి శాపంగా మారింది. బాల్ సిక్స్​కు వెళ్తే అంపైర్లు సరిగ్గా చూడకుండా బౌండరీ అని ప్రకటించారు. అలాగే ఇంకో బ్యాటర్ ఔట్ సమయంలో నరైన్ నో బాల్ వేశాడు. కానీ అంపైర్ దాన్ని కరెక్ట్ బాల్​గా ప్రకటించారు. ఇక, కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా మీద ఓ మ్యాచ్​ ఆడకుండా బ్యాన్ పడటం తెలిసిందే. టోర్నీ ఆరంభంలో ఎస్​ఆర్​హెచ్​తో మ్యాచ్​లో మయాంక్ అగర్వాల్​ను ఔట్ చేశాక హర్షిత్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. మొన్న ఇంకో మ్యాచ్​లోనూ ఇలాగే కిస్ ఇవ్వబోయి ఆగిపోయాడు. దీంతో అతడిపై చర్యలు తీసుకున్నారు. కానీ గుజరాత్ టైటాన్స్​తో మ్యాచ్​లో కోహ్లీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినా అతడిపై ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇలా లెక్కకు మించిన తప్పులు చేస్తున్న అంపైర్లు లీగ్ పరువు తీస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. ఐపీఎల్​లో అంపైరింగ్ మిస్టేక్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments