Virat Kohli: SRHతో మ్యాచ్.. కొత్త రికార్డు క్రియేట్ చేసిన కోహ్లీ!

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. సన్​రైజర్స్ హైదరాబాద్​తో మ్యాచ్​లో కింగ్ అరుదైన ఘనత సాధించాడు.

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. సన్​రైజర్స్ హైదరాబాద్​తో మ్యాచ్​లో కింగ్ అరుదైన ఘనత సాధించాడు.

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. సన్​రైజర్స్ హైదరాబాద్​తో మ్యాచ్​లో కింగ్ అరుదైన అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్​కు దిగిన స్టార్ బ్యాటర్.. వచ్చిన బాల్​ను వచ్చినట్లు బౌండరీ లైన్​కు తరలిస్తున్నాడు. 21 బంతుల్లో 34 పరుగులతో మంచి దూకుడు మీద ఉన్నాడు. 4 ఫోర్లు కొట్టిన కింగ్.. 1 భారీ సిక్స్ బాదాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు.

ఎస్​ఆర్​హెచ్​తో మ్యాచ్​లో కొట్టిన నాలుగు బౌండరీలతో ఈ సీజన్​లో కోహ్లీ కొట్టిన ఫోర్ల సంఖ్య 40కు చేరింది. తద్వారా ఒక ఐపీఎల్ ఎడిషన్​లో అత్యధిక బౌండరీలు బాదిన ప్లేయర్​గా విరాట్ రికార్డు సృష్టించాడు. అలాగే మరో రికార్డును కూడా తన పేరు మీద రాసుకున్నాడు. ఎస్​ఆర్​హెచ్​తో మ్యాచ్​లో 400 పరుగుల మార్క్​ను చేరుకున్నాడు. ఐపీఎల్​ హిస్టరీలో 400కి పైగా స్కోర్లను 10 సార్లు బాదిన తొలి ప్లేయర్​గా కింగ్ నిలిచాడు. ఇక, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆర్సీబీ ప్రస్తుతం 7 ఓవర్లకు 65 పరుగులతో ఉంది. ఒకవైపు కింగ్ నిలకడగా ఆడుతున్నా మరోవైపు అతడికి అండగా నిలిచేవారు కరువయ్యారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (25) మంచి స్టార్ట్ వచ్చినా దాన్ని క్యాష్ చేసుకోలేకపోయాడు. పించ్ హిట్టర్ విల్ జాక్స్ (6) త్వరగా పెవిలియన్​కు చేరుకున్నాడు.

Show comments