Nidhan
సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లను అతడు ఊచకోత కోశాడు.
సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లను అతడు ఊచకోత కోశాడు.
Nidhan
ఫస్ట్ మ్యాచ్‌లో గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్‌లో అదరగొడుతోంది. ఈ సీజన్లో బోణీ కొట్టాలనే కసి మీద ఉన్న ఆ టీమ్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెలరేగిపోతోంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు మెరుపు ఆరంభం లభించింది. మయాంక్ అగర్వాల్ (11) త్వరగానే ఔట్ అయినా.. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లో 62 పరుగులు చేశాడతను. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లను అతడు ఊచకోత కోశాడు.
నెక్స్ట్ లెవల్ బ్యాటింగ్‌తో ముంబై బౌలర్లకు ఓ రేంజ్లో పోయించాడు హెడ్. జస్ప్రీత్ బుమ్రాను తప్పితే మిగతా బౌలర్లు అందరితోనూ ఆడుకున్నాడు. కొత్త కుర్రాడు క్వెనా మఫాకా బౌలింగ్‌లో ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 9 బౌండరీలు బాదిన హెడ్.. 3 భారీ సిక్సులు కొట్టాడు. అతడికి అభిషేక్ శర్మ (44 నాటౌట్) మంచి సపోర్ట్ అందించాడు. వీళ్లిద్దరి జోరును తట్టుకోలేక ముంబై బౌలర్లు బేజారైపోయారు. అయితే ఎట్టకేలకు హెడ్‌ను గెరాల్డ్ కొయెట్జీ ఔట్ చేశాడు. మరి.. హెడ్ ఊచకోత మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
TRAVIS HEAD SMASHED THE FASTEST FIFTY IN IPL HISTORY FOR SRH…!!! 🤯💥 pic.twitter.com/h0QZ9SF7CT
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2024