Nidhan
లక్నో బౌలర్లపై సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తుఫానులా విరుచుకుపడ్డాడు. ఆ జట్టు బౌలర్లను పిచ్చకొట్టుడు కొట్టాడు.
లక్నో బౌలర్లపై సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తుఫానులా విరుచుకుపడ్డాడు. ఆ జట్టు బౌలర్లను పిచ్చకొట్టుడు కొట్టాడు.
Nidhan
అసలైన టీ20 క్రికెట్ అంటే ఎలా ఉంటుందో చూపించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. బాదుడుకు నయా డెఫినిషన్ చెబుతూ కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జియాంట్స్‌ను చిత్తు చేసింది. రాహుల్ సేన సంధించిన 165 పరుగుల టార్గెట్‌ను 9.4 ఓవర్లలోనే ఊది పారేసింది. ఛేజింగ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ చెలరేగిపోయారు. విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించారు. తుఫాను వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో లక్నో బౌలర్లకు ప్రత్యక్షంగా చూపించారు.
అభిషేక్ 28 బంతుల్లో 75 పరుగులు చేయగా.. హెడ్ 30 బంతుల్లో 89 పరుగులు చేశాడు. హెడ్ అయితే 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఓవరాల్‌గా 8 బౌండరీలు బాదిన ఈ మాస్ బ్యాటర్.. 8 భారీ సిక్సులు బాదడం విశేషం. అభిషేక్ కూడా 8 ఫోర్లు, 6 సిక్సులతో లక్నో బౌలర్లకు నరకం చూపించాడు. హెడ్ మొదట్లో చెలరేగగా.. ఆ తర్వాత అభిషేక్ హిట్టింగ్ మొదలుపెట్టాడు. వీళ్ల దెబ్బకు పవర్‌ప్లేలోనే స్కోరు బోర్డు మీద 107 పరుగులు చేరాయి. మరి.. అభిషేక్-హెడ్ ఉతుకుడు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
ABHISHEK & HEAD ON A MISSION IN IPL 2024 TO DESTROY THE BOWLERS. 🥶 pic.twitter.com/rrTHDOCAZe
— Johns. (@CricCrazyJohns) May 8, 2024