Nidhan
ఓవరాక్షన్ స్టార్ రియాన్ పరాగ్ మాస్ హిట్టింగ్తో చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను ఓ రేంజ్లో ఆడుకున్నాడు.
ఓవరాక్షన్ స్టార్ రియాన్ పరాగ్ మాస్ హిట్టింగ్తో చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను ఓ రేంజ్లో ఆడుకున్నాడు.
Nidhan
ఐపీఎల్లో ఓవరాక్షన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడతను. బ్యాటర్‌గా టీమ్‌లో ఉన్నా ఏనాడు భారీ స్కోర్లు బాదింది లేదు. ఒక్క సిక్స్ కొట్టినా లేదా ఓ క్యాచ్ పట్టినా బాగా బిల్డప్ ఇస్తాడు. అతడి వింత చేష్టలు చూసి ఫ్యాన్స్ ఓవరాక్షన్ స్టార్ అని పేరు పెట్టారు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ట్రోల్ చేసేవారు. అయితే మొత్తానికి అతడిలో మార్పు వచ్చింది. తాను ఓవరాక్షన్ స్టార్ కాదు.. సూపర్ స్టార్ అని ప్రూవ్ చేసే పనిలో పడ్డాడా బ్యాటర్. అతడే రియాన్ పరాగ్. ఈ ఏడాది డొమెస్టిక్ క్రికెట్లో దుమ్మురేపిన అతడు.. రంజీ ట్రోఫీలో చెలరేగి బ్యాటింగ్ చేశాడు. దీంతో ఐపీఎల్‌లోనూ రాణిస్తాడని అంతా అనుకున్నారు. ఆడియెన్స్ అంచనాలను అతడు నిలబెట్టాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లో 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో సెకండ్ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడతను. మొత్తంగా 45 బంతులు ఫేస్ చేసిన ఈ రాజస్థాన్ బ్యాటర్.. 84 పరుగులు చేశాడు. 7 బౌండరీలు బాదిన పరాగ్.. 6 భారీ సిక్సులు కొట్టాడు. అతడి ఐపీఎల్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్ స్కోరు కావడం విశేషం. స్టార్ పేసర్ నార్త్జే వేసిన లాస్ట్ ఓవర్లో విధ్వంసం సృష్టించాడు పరాగ్. ఆ ఓవర్లో ఏకంగా 25 పరుగులు పిండుకున్నాడు. అందులో 3 ఫోర్లు, 2 సిక్సలు ఉన్నాయి. 4 వికెట్లకు 90 పరుగులతో కష్టాల్లో ఉన్న రాజస్థాన్ 20 ఓవర్లు ముగిసేసరికి 185 పరుగుల భారీ స్కోరు చేసింది. దీనికి పరాగ్ ఆడిన సూపర్బ్ ఇన్నింగ్స్ కారణమని చెప్పొచ్చు. మరి.. పరాగ్ మెరుపు ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: MS Dhoni: ధోని ముసలోడే కదా.. సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
TAKE A BOW, RIYAN PARAG…!!!!! 💥
84* (45) with 7 fours and 6 sixes – mercilessly trolled in the past for not performing, tonight he shows his potential and plays a world class knock for Rajasthan Royals. 🤯 pic.twitter.com/0RsjrWG2z9
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 28, 2024