BCCI డిసిషన్​తో డిప్రెషన్​లో KL రాహుల్.. ఒక్క సీన్​తో బయటపడిన బాధ!

భారత క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో స్టైలిష్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తీవ్రంగా నిరుత్సాహానికి గురయ్యాడు. ఒక్క సీన్​తో అతడు ఎంత డిప్రెషన్​లో ఉన్నాడో బయటపడింది.

భారత క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో స్టైలిష్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తీవ్రంగా నిరుత్సాహానికి గురయ్యాడు. ఒక్క సీన్​తో అతడు ఎంత డిప్రెషన్​లో ఉన్నాడో బయటపడింది.

కేఎల్ రాహుల్.. మోస్ట్ స్టైలిష్ బ్యాటర్​గా పేరు తెచ్చుకున్న క్రికెటర్. గత కొన్నేళ్లుగా భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా విజయాల్లో అతడి పాత్ర ఎంతో కీలకం. మూడు ఫార్మాట్లలోనూ టీమ్​లో ఇంపార్టెంట్​ ప్లేయర్​గా మారాడు రాహుల్. అద్భుతమైన బ్యాటింగ్​తో పాటు వికెట్ కీపింగ్​తోనూ టీమ్ సక్సెస్​లో తన పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. రిషబ్ పంత్ దూరమైనప్పుడు కీపర్​గా వన్డే వరల్డ్ కప్​తో పాటు ఇతర సిరీస్​ల్లోనూ ఆ రోల్​ను సమర్థవంతంగా నిర్వహించాడు. ఇంక యాంకర్ ఇన్నింగ్స్​లతో టీమ్ విజయాల్లో అతడు ఎంత కీలకంగా మారాడో చెప్పనవసరం లేదు. అలాంటోడి విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

టీ20 వరల్డ్ కప్​ టీమ్​ను మంగళవారం ప్రకటించింది బీసీసీఐ. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అనౌన్స్ చేసింది. అయితే ఇందులో కేఎల్ రాహుల్​కు చోటు దక్కలేదు. టీమ్​లో రెగ్యులర్ ప్లేయర్​గా ఉంటూ, బ్యాటర్​గా, కెప్టెన్​గా సేవలు అందిస్తూ, విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వచ్చినా అతడ్ని సెలెక్టర్లు కరుణించలేదు. ఫస్ట్ ఛాయిస్ కీపర్​గా పంత్, అతడికి బ్యాకప్​గా సంజూ శాంసన్​ను ఎంపిక చేశారు. కానీ ఇన్నాళ్లూ టీమ్​తో ట్రావెల్ చేసిన రాహుల్​ను మాత్రం దూరం పెట్టారు. ఇది అతడ్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్​తో పాటు ఐపీఎల్​లోనూ రాణించినా టీమ్​లో చోటు దక్కకపోవడంతో డిప్రెషన్​లోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తున్నాడు కేఎల్. అతడిలో ఉన్న బాధంతా ముంబై ఇండియన్స్​తో మ్యాచ్​లో బయటపడింది.

టాస్ టైమ్​లో ఎంఐ సారథి హార్దిక్​తో కలసి గ్రౌండ్​లోకి వచ్చాడు రాహుల్. అయితే ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా కనిపించే అతడు ఇవాళ మాత్రం చాలా డల్​గా కనిపించాడు. అతడి కళ్లలో పెయిన్ బయటకు క్లియర్​గా కనిపించింది. ముఖంలో నవ్వు లేదు, కళ్లలో తీవ్రమైన బాధ. వరల్డ్ కప్ బెర్త్ మిస్సయిందనే పెయిన్ అతడిలో ఎంత ఉందో ఈ ఫొటోలు, వీడియోలే ప్రూఫ్. దీన్ని చూసిన నెటిజన్స్.. బోర్డు తప్పు చేసిందని, సీనియర్ ప్లేయర్​ను ఇలా అవమానించడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. అవసరమైనప్పుడు కీపర్​గా వాడుకున్నారు.. కానీ ఇప్పుడు వదిలేశారని, ఇది దారుణం అని ఫైర్ అవుతున్నారు. మరి.. రాహుల్ విషయంలో బోర్డు తప్పు చేసిందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments