Nidhan
ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో దిగువన ఉన్న రెండు టీమ్స్ మధ్య సండే ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టాలని ముంబై.. రెండో గెలుపుతో సక్సెస్ ట్రాక్ మీదకు రావాలని ఢిల్లీ పట్టుదలతో ఉన్నాయి.
ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో దిగువన ఉన్న రెండు టీమ్స్ మధ్య సండే ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టాలని ముంబై.. రెండో గెలుపుతో సక్సెస్ ట్రాక్ మీదకు రావాలని ఢిల్లీ పట్టుదలతో ఉన్నాయి.
Nidhan
ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో దిగువన ఉన్న రెండు టీమ్స్ మధ్య సండే ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టాలని ముంబై.. రెండో గెలుపుతో సక్సెస్ ట్రాక్ పట్టాలని ఢిల్లీ పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగడం ఖాయం. రెండు టీమ్స్ గెలిచి తీరాలని అనుకుంటున్నాయి కాబట్టి మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్లడం పక్కా. హ్యాట్రిక్ ఓటముల వల్ల ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆ టీమ్ కచ్చితంగా గెలవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలా ఉండనుంది? విజయావకాశాలు ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం..
ముంబైలో ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువగా ఉన్నాయి. ఆ టీమ్ ఓపెనింగ్ సరిగ్గా లేదు. మొదట్లో అదరగొట్టిన రోహిత్ శర్మ రాజస్థాన్ రాయల్స్‌పై గోల్డెన్‌గా డక్‌గా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ కూడా పెద్ద ఫామ్‌లో ఏమీ లేడు. ఓపెనర్ల ఫెయిల్యూర్ టీమ్ బలహీనతగా మారింది. నమన్ ధీర్, డెవాల్డ్ బ్రేవిస్ నిలకడలేమి కూడా జట్టును వేధిస్తోంది. తిలక్ వర్మ మంచి టచ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన పొటెన్షియల్‌కు తగ్గట్లు ఆడటం లేదు. మ్యాచ్‌లు ఫినిష్ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ అతడు తేలిపోతుండటం ఎంఐకి మరో మైనస్. బౌలింగ్‌లో ఆకాశ్ మధ్వాల్ వికెట్లు తీస్తుండటం బిగ్ ప్లస్. జస్ప్రీత్ బుమ్రా పరుగులు కట్టడి చేస్తున్నాడు. అయితే మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం మైనస్.
ఢిల్లీ జట్టు ఆడిన 4 మ్యాచుల్లో మూడింట ఓడి నిరాశలో ఉంది. గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 106 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఆ ఒక్క మ్యాచ్‌ను తీసేస్తే అంతకుముందు అన్ని మ్యాచుల్లోనూ ఢిల్లీ ఆటతీరు బాగుంది. కేకేఆర్ మీద డీసీ బౌలర్లు అట్టర్‌ఫ్లాప్ అయ్యారు. నోకియా, ఇషాంత్ సహా బౌలర్లు అంతా ఫెయిలయ్యారు. వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ రిషబ్ పంత్ రెడ్ హాట్ ఫామ్‌లో ఉండటం డీసీకి బిగ్ ప్లస్. ట్రిస్టన్ స్టబ్స్ కూడా మంచి టచ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. డేవిడ్ వార్నర్‌కు తోడు మరో ఓపెనర్ పృథ్వీ షా రిథమ్‌లోకి వస్తే ఆ టీమ్‌కు తిరుగుండదు. అయితే మిచెల్ మార్ష్ ఫెయిల్యూర్ పంత్ సేనకు పెద్ద వర్రీగా మారింది. అదే టైమ్‌లో గాయంతో ఇబ్బంది పడుతున్న కుల్దీప్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఆ జట్టు సమస్యలు మరింత పెరిగాయి.
రెండు టీమ్స్ బలాబలాలను బట్టి ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలవడం ఖాయం. వరుస ఓటములతో కసిగా ఉన్న హార్దిక్ సేన ఈ మ్యాచ్‌తో బోణీ కొట్టడం పక్కా. ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఢిల్లీ 15 సార్లు నెగ్గగా.. ముంబై 18 సార్లు గెలిచింది. డీసీ కూడా బలంగా ఉన్నా.. ప్రెజర్లో ఉన్న ముంబై జూలు విదిల్చి ఆడటం పక్కాగా కనిపిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఫస్ట్ నుంచే డామినేట్ చేయాలని ఫిక్స్ అయింది ఎంఐ.
ముంబై: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కొయెట్జీ, పీయుష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జస్ప్రీత్ బుమ్రా, క్వెనా మఫాకా.
ఢిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
ఇదీ చదవండి: T20 వరల్డ్ కప్ కాదు.. నా టార్గెట్ అక్కడ ఆడటమే: మయాంక్