T20 వరల్డ్ కప్ కాదు.. నా టార్గెట్ అక్కడ ఆడటమే: మయాంక్

ఐపీఎల్​లో అదరగొడుతున్న లక్నో ఎక్స్​ప్రెస్ మయాంక్ యాదవ్​ను టీ20 వరల్డ్ కప్​లో ఆడించాల్సిందేనని అభిమానులు పట్టుబడుతున్నారు. అయితే అతడు మాత్రం ప్రపంచ కప్ కాదు.. తన టార్గెట్ అక్కడ ఆడటమేనని అంటున్నాడు.

ఐపీఎల్​లో అదరగొడుతున్న లక్నో ఎక్స్​ప్రెస్ మయాంక్ యాదవ్​ను టీ20 వరల్డ్ కప్​లో ఆడించాల్సిందేనని అభిమానులు పట్టుబడుతున్నారు. అయితే అతడు మాత్రం ప్రపంచ కప్ కాదు.. తన టార్గెట్ అక్కడ ఆడటమేనని అంటున్నాడు.

మయాంక్ యాదవ్.. ఇండియన్ క్రికెట్​లో మార్మోగుతున్న పేరిది. కళ్లుచెదిరే వేగంతో బౌలింగ్ చేస్తూ.. నిలకడగా వికెట్లు సాధిస్తూ.. ఐపీఎల్​లో ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచిన ప్లేయర్​గా చరిత్ర సృష్టించాడు. గంటకు 150 కిలోమీటర్ల పేస్​తో అతడు సంధిస్తున్న బుల్లెట్ డెలివరీస్​కు తోపు బ్యాటర్ల దగ్గరా సమాధానం లేకుండా పోయింది. షాట్లు ఆడితే వికెట్లు పడుతున్నాయి, డిఫెన్స్ చేసినా ఔట్ అవుతున్నారు, దీంతో మయాంక్​ను ఎలా ఎదుర్కోవాలో తెలియక బ్యాటర్లు గుడ్లు తేలేస్తున్నారు. టీమిండియాలోకి అతడి ఎంట్రీ ఖాయమని అభిమానులు అంటున్నారు. వచ్చే టీ20 వరల్డ్ కప్​లో భారత తరఫున మయాంక్ దుమ్మురేపడం తథ్యమని చెబుతున్నారు. అయితే నయా పేసుగుర్రం ఆశలు మాత్రం డిఫరెంట్​గా ఉన్నాయి.

టీ20ల కంటే టెస్టు క్రికెట్ అంటేనే తనకు చాలా ఇష్టమని మయాంక్ యాదవ్ అన్నాడు. రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు అవసరమైనట్లుగా తన బాడీని ఫిట్​గా ఉంచుకోవడం మీద ఫోకస్ చేస్తున్నానని చెప్పాడు. లాంగ్ ఫార్మాట్​లో ఆడటం తనకు ఎంతో ఇంపార్టెంట్ అని తెలిపాడు. ‘నా టాలెంట్​ను చూపించుకునే అవకాశం కోసం చిన్నప్పటి నుంచి వెయిట్ చేశా. నా పెర్ఫార్మెన్స్​కు ప్రజల నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుందని ఎక్స్​పెక్ట్ చేయలేదు. ఆడియన్స్ స్పందన చాలా బాగుంది. భారత్​కు ఆడాలనేది నా డ్రీమ్. చాన్నాళ్ల పాటు దేశానికి సేవ చేయాలి. ఇప్పుడు మాత్రం ఐపీఎల్​ మీదే ఫోకస్ చేస్తున్నా. ఈ లీగ్ ముగిసిన తర్వాత ఏం జరుగుతుందనేది తెలియదు. టీ20 వరల్డ్ కప్, ఇతర సిరీస్​లకు నన్ను సెలక్ట్ చేయాలని అంటున్నారు. కానీ నాకు ఆ ఎక్స్​పెక్టేషన్స్ లేవు’ అని మయాంక్ చెప్పుకొచ్చాడు.

టీ20 ప్రపంచ కప్​లో ఆడాలనే టార్గెట్ పెట్టుకోలేదని.. తనకు అలాంటి భారీ అంచనాలు లేవన్నాడు మయాంక్. ప్రస్తుతం ఐపీఎల్​లో మీద దృష్టి పెట్టానని.. లీగ్ ముగిసిన తర్వాత టెస్టు క్రికెట్​కు తగ్గట్లు తనను తాను మార్చుకోవాలని అనుకుంటున్నానని చెప్పాడు పేసు గుర్రం. అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్రికెట్​కు నిజమైన డెఫినిషన్ లాంటి రెడ్ బాల్ క్రికెట్​లో ఆడాలనుకోవడం సూపర్బ్ అని.. మయాంక్ ఆలోచనకు తిరుగులేదని మెచ్చుకుంటున్నారు నెటిజన్స్. అయితే జస్​ప్రీత్‌ బుమ్రాలా అన్ని ఫార్మాట్లలోనూ ఆడే సత్తా అతడికి ఉందని అంటున్నారు. మయాంక్ ఫిట్​నెస్, రిథమ్, స్పీడ్, లైన్ అండ్ లెంగ్త్, వేరియేషన్స్ చూస్తుంటే.. అతడు టీ20 వరల్డ్ కప్​కు రెడీగా ఉన్నాడని, మెగా టోర్నీలో ఆడే ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మరి.. మయాంక్ ప్రపంచ కప్​లో ఆడాలని మీరు కోరుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ధోని బ్యాటింగ్‌కి రాకుండా కమిన్స్ మాస్టర్ ప్లాన్! జడేజా పరువు తీసేశాడు!

Show comments