Nidhan
రెండే రెండు మ్యాచులతో ఫేస్ ఆఫ్ ది ఐపీఎల్‌గా మారిపోయాడు మయాంక్ యాదవ్. పదునైన పేస్‌తో బ్యాటర్లను వణికిస్తున్నాడీ లక్నో ఎక్స్‌ప్రెస్. అలాంటోడ్ని గెలికాడు ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్.
రెండే రెండు మ్యాచులతో ఫేస్ ఆఫ్ ది ఐపీఎల్‌గా మారిపోయాడు మయాంక్ యాదవ్. పదునైన పేస్‌తో బ్యాటర్లను వణికిస్తున్నాడీ లక్నో ఎక్స్‌ప్రెస్. అలాంటోడ్ని గెలికాడు ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్.
Nidhan
మయాంక్ యాదవ్.. ఐపీఎల్లో బ్యాటర్లు అందర్నీ భయపెడుతున్న బౌలర్. ఆడిన రెండు మ్యాచుల్లో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీన్ని బట్టే అతడి బౌలింగ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేస్ బౌలింగ్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్నాడు మయాంక్. ఒక బాల్ లేదా ఒక ఓవర్ కాదు.. స్పెల్ మొత్తం 150 కిలోమీటర్లకు తగ్గని వేగంతో నిలకడగా బంతుల్ని సంధిస్తూ బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్నాడు. స్పీడ్‌ను తట్టుకోవడమే కష్టం అంటే.. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌ను పట్టుకొని బౌలింగ్ చేస్తుండటంతో ధావన్, బెయిర్ స్టో, మాక్స్వెల్, గ్రీన్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు కూడా అతడ్ని ఎదుర్కోలేకపోయారు. అలాంటోడ్ని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ గెలికాడు. అసలు మయాంక్‌ను ఉద్దేశించి స్మిత్ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఏడాది ఆఖర్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ఈ నేపథ్యంలో మయాంక్ ఆ టోర్నీలో ఆడాలని స్మిత్ అన్నాడు. అతడి బౌలింగ్‌ను ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ గెలికాడు. ఐపీఎల్లో మయాంక్ బౌలింగ్ వేస్తున్న తీరు అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు స్మిత్. అతడు మంచి ఏరియాల్లో బంతుల్ని హిట్ చేస్తున్నాడని, షార్ట్ బాల్స్ వేయడంలోనూ ఆరితేరాడని ప్రశంసించాడు. అయితే అంత కచ్చితత్వంతో మంచి ఏరియాల్లో నిలకడగా బంతులు సంధించడం ఈజీ కాదని.. కానీ మయాంక్ సుసాధ్యమని నిరూపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు స్మిత్. 155 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే బౌలర్‌ను ఎదుర్కోవాలంటే మంచి బంతులకు కూడా రిస్క్ తీసుకోక తప్పదని.. కానీ ఇది చాలా కష్టమైన పని అని పేర్కొన్నాడు.
మయాంక్‌ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నానంటూ స్మిత్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అతడ్ని రెచ్చగొట్టొద్దని.. ఇక, ఆసీస్‌ను పోయించే దాకా వదలడని కామెంట్స్ చేస్తున్నారు. మయాంక్ జోరు మీదున్నాడని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే కాదు.. త్వరలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లోనూ అతడు కంగారూల మీద విరుచుకుపడటం ఖాయమని చెబుతున్నారు. కాగా, స్మిత్ కామెంట్స్ కంటే ముందే మయాంక్ గురించి అతడ్ని హెచ్చరించాడు ఇంగ్లండ్ లెజెండ్ స్టువర్ట్ బ్రాడ్. అతడి పేస్, లైన్ అండ్ లెంగ్త్, బాల్‌పై కంట్రోల్ చాలా గొప్పగా ఉన్నాయని మెచ్చుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడి బౌలింగ్ నుంచి స్మిత్‌తో పాటు మిగిలిన ఆసీస్ బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిందేనని సూచించాడు బ్రాడ్. మరి.. మయాంక్‌ను స్మిత్ ఆపగలడా? ఈ విషయం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: అతనికి విరాట్ కోహ్లీ వికెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు! ఎవరీ సిద్థార్ధ్?
Steven Smith said, “Mayank Yadav should play the Border Gavaskar Trophy in Australia. I’m looking forward to facing him”. (Star Sports). pic.twitter.com/xDQnF8Qg2A
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 3, 2024