Nidhan
అరంగేట్ర మ్యాచ్‌లోనే బుల్లెట్ వేగంతో బంతులు విసురుతూ అదరగొట్టాడు. ఒక్క స్పెల్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అసలు ఎవరీ మయాంక్ యాదవ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అరంగేట్ర మ్యాచ్‌లోనే బుల్లెట్ వేగంతో బంతులు విసురుతూ అదరగొట్టాడు. ఒక్క స్పెల్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అసలు ఎవరీ మయాంక్ యాదవ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
క్రికెట్లో పేస్ బౌలింగ్ అనగానే ఆస్ట్రేలియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా టీమ్సే మొదటగా గుర్తుకొస్తాయి. ఆ జట్ల నుంచి ఎందరో అత్యుత్తమ పేసర్లు వచ్చి అంతర్జాతీయ క్రికెట్లో ఓ వెలుగు వెలిగారు. ఒకప్పుడు వెస్టిండీస్ కూడా పేస్‌గా అడ్డాగా ఉండేది. అయితే భారత్ మాత్రం స్పిన్‌లో టాప్‌గా ఉండేది. మన దేశం నుంచి దిగ్గజ స్పిన్నర్లు ఇంటర్నేషనల్ క్రికెట్లో హవా నడిపించారు. అదే టైమ్‌లో కపిల్ దేవ్, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ లాంటి వాళ్లు నిఖార్సయిన పేస్ బౌలింగ్‌తో తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా కూడా వారి అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. అయితే ఎంతమంది పేసర్లు వచ్చినా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు వేస్తూ భయపెట్టేవారు మన దగ్గర తక్కువే. కానీ ఆ లోటును తీర్చేందుకు తాను ఉన్నానని భరోసా ఇస్తున్నాడు మయాంక్ యాదవ్.
ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జియాంట్స్ తరఫున బరిలోకి దిగి అదరగొట్టాడు మయాంక్. డెబ్యూ మ్యాచ్‌లోనే గంటకు 150 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా నిలకడగా బంతులు సంధించాడు. ఒక బాల్ అయితే ఏకంగా 155.8 కిలోమీటర్ల వేగంతో వేసి అందర్నీ నివ్వెరపోయేలా చేశాడు. ఈ సీజన్లో ఇదే ఫాస్టెస్ట్ బాల్ కావడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ స్పీడ్‌స్టర్ బర్గర్ (153 కి.మీ) పేరిట ఉన్న రికార్డులను మయాంక్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన యాదవ్.. 27 పరుగులు ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీశాడు. 11 ఓవర్లకు 100 పరుగులతో పటిష్టంగా ఉన్న పంజాబ్ 178 పరుగులకు పరిమితమై ఓడిందంటే అది మయాంక్ వల్లేనని చెప్పాలి. బుల్లెట్ వేగంతో బంతులు విసిరిన అతడి బౌలింగ్‌లో స్లోయెస్ట్ బాల్ 141 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. దీన్ని బట్టే మయాంక్ స్పెల్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఒక్క స్పెల్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన మయాంక్ గురించి తెలుసుకునేందుకు అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు ఇంతకుముందు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.. 21 ఏళ్ల మయాంక్ ఢిల్లీలో పుట్టాడు. అదే రాష్ట్రం తరఫున డొమెస్టిక్ క్రికెట్లో ఆడుతూ వెలుగులోకి వచ్చాడు. రంజీ ట్రోఫీ-2022 సీజన్లో మహారాష్ట్రలో మ్యాచ్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన యాదవ్.. అనంతరం లిస్ట్-ఏ, టీ20 క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది దేవ్‌ధర్ ట్రోఫీలో నార్త్‌జోన్ తరఫున ఆడుతూ 5 మ్యాచుల్లోనే 12 వికెట్లు పడగొట్టి హయ్యెస్ట్ జాయింట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా మూడు ఫార్మాట్లలోనూ కలిపి 46 వికెట్లు తీశాడు. ఐపీఎల్-2023కి ముందు జరిగిన మెగా వేలంలో అతడ్ని రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కు లక్నో దక్కించుకుంది. అయితే ఇంజ్యురీ కారణంగా గతేడాది అతడు ఆడలేకపోయాడు. దీంతో అతడి ప్లేస్‌లో అర్పిత్ గులేరియాను తీసుకున్నారు. ఈసారి ఐపీఎల్‌కు ముందు మినీ వేలంలో అతడ్ని లక్నో మళ్లీ సొంతం చేసుకుంది. మరి.. పంజాబ్‌తో మ్యాచ్‌లో మయాంక్ బౌలింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: IPLతో BCCI రియల్ గేమ్.. బోర్డు నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు!
The unreal speed of 155.8 on his debut day.
MAYANK YADAV 🔥 pic.twitter.com/h4QUq5H3Lu
— _𝘚𝘏𝘈𝘋𝘠𝘠𝘠𝘈𝘏𝘐𝘙𝘙 (@TheAHIR_) March 31, 2024