Nidhan
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జియాంట్స్ అందరికీ షాక్ ఇచ్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై వేటు వేసింది. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జియాంట్స్ అందరికీ షాక్ ఇచ్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై వేటు వేసింది. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఐపీఎల్-2024ను ఓటమితో మొదలుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్.. రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అనూహ్య నిర్ణయంతో షాక్ ఇచ్చింది ఎల్ఎస్జీ. కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను సారథ్య పగ్గాల నుంచి తప్పించింది. అతడి ప్లేస్‌లో మరో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. దీంతో అసలు ఏం జరుగుతోందో ఎల్ఎస్జీ అభిమానులకు అర్థం కాలేదు. టాస్ టైమ్‌లో పూరన్ వచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. దీంతో ఆ జట్టు అభిమానులు షాకయ్యారు. రాహుల్‌పై వేటుకు కారణం ఏంటని ఆలోచనల్లో పడ్డారు.
కెప్టెన్‌గా ఉన్నోడ్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా దించడం ఏంటని రాహుల్ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కేఎల్‌కు గాయం తిరగబెట్టింది. దీంతో ఆ సిరీస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఇంజ్యురీ నుంచి కోలుకున్న అతడికి ఇంకొన్నాళ్ల పాటు రెస్ట్ అవసరం. దీంతో అతడికి విశ్రాంతి ఇవ్వాలని లక్నో మేనేజ్మెంట్ డిసైడ్ అయింది. కానీ టీమ్‌లో ఉంటానని రాహుల్ పట్టుబట్టడంతో అతడ్ని కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేయాలని యాజమాన్యం భావించిందని నికోలస్ పూరన్ తెలిపాడు. అందుకే అతడ్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకున్నామని చెప్పాడు. మరి.. రాహుల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
KL Rahul as an impact player for Lucknow…!!! pic.twitter.com/v9B3VPYGuk
— Johns. (@CricCrazyJohns) March 30, 2024