Nidhan
లక్నో పించ్ హిట్టర్ నికోలస్ పూరన్ మాస్ హిట్టింగ్తో రెచ్చిపోయాడు. సిక్సులు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకొని ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు.
లక్నో పించ్ హిట్టర్ నికోలస్ పూరన్ మాస్ హిట్టింగ్తో రెచ్చిపోయాడు. సిక్సులు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకొని ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు.
Nidhan
లక్నో సూపర్ జెయింట్స్ పించ్ హిట్టర్ నికోలస్ పూరన్ మాస్ బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. సిక్సులు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకొని ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. వాంఖడే స్టేడియంలో మినీ సునామీని సృష్టించాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు పూరన్. మొత్తంగా 29 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఇందులో 5 బౌండరీలతో పాటు 8 భారీ సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌తో ఓ అరుదైన ఘనతను అందుకున్నాడతను.
పూరన్ చరిత్ర సృష్టించాడు. 19 బంతుల్లో అర్ధశతకం మార్క్‌ను చేరుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2024లో లక్నో తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. ఓవరాల్ లీగ్ హిస్టరీలో చూసుకుంటే.. ఎల్ఎస్జీ తరఫున ఆడుతూ ఒకసారి 15 బంతుల్లో, మరోమారు 20 బంతుల్లో ఫిఫ్టీలు బాదాడు పూరన్. ఈ మ్యాచ్‌లో 19 బంతుల్లోనే ఆ మార్క్‌ను చేరుకున్నాడు. దీంతో ఎల్ఎస్జీ తరఫున మూడుసార్లు ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ కొట్టిన బ్యాటర్‌గానూ అతడు నిలిచాడు. ఇక, పూరన్‌తో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 55) రాణించడంతో లక్నో ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు చేసింది. మరి.. పూరన్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Nicholas Pooran – the cleanest striker! pic.twitter.com/a3YHbCLTUo
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 17, 2024
Fastest fifty for Lucknow Super Giants in IPL history:
– Nicholas Pooran from 15 balls.
– Nicholas Pooran from 19 balls.
– Nicholas Pooran from 20 balls. pic.twitter.com/Q2PYoHC0BH— Johns. (@CricCrazyJohns) May 17, 2024