IPLలో సరికొత్త ప్రయోగం.. ఇక బ్యాటర్లకు చుక్కలే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో మరో సరికొత్త ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇది గానీ సక్సెస్ అయిందా ఇక బ్యాటర్లకు చుక్కలే.

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో మరో సరికొత్త ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇది గానీ సక్సెస్ అయిందా ఇక బ్యాటర్లకు చుక్కలే.

ఐపీఎల్-2024 ఎన్నో రికార్డులకు వేదికగా నిలిచింది. ఎన్నడూ లేనిది టోర్నీలో అతి భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. నీళ్లు తాగినంత సులువుగా జట్లు 200 ప్లస్ స్కోర్లు బాదేస్తున్నాయి. 250 ప్లస్ స్కోర్లు కూడా ఇప్పుడు కామన్ అయిపోయాయి. బౌలర్లను నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తున్నారు బ్యాటర్లు. దయ, జాలి అనేది లేకుండా బాల్ కనిపించిందే తడవు భారీ షాట్లు బాదుతున్నారు. జస్​ప్రీత్ బుమ్రా లాంటి ఒకరిద్దరు టాప్ బౌలర్లు తప్ప అంతా బ్యాటర్ల దాడిలో బలవుతున్నారు. ఎలాంటి బంతులు వేస్తున్నా పరుగులు లీక్ అవుతుండటంతో ఎవరికీ ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయితే బౌలర్లకు గుడ్ న్యూస్. క్యాష్ రిచ్ లీగ్​లో నయా ప్రయోగానికి బీసీసీఐ రెడీ అవుతోంది. ఇది గానీ సక్సెస్ అయిందా ఇక బ్యాటర్లకు చుక్కలేనని చెప్పాలి.

ఐపీఎల్ పదిహేడో సీజన్​లో ఇప్పటికే రూల్స్ విషయంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లీగ్​లో మరో ఎక్స్​పెరిమెంట్​కు భారత బోర్డు సిద్ధమైంది. ఫ్లాట్ పిచ్​లు రూపొందిస్తుండటంతో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. బాల్​కు, బ్యాట్​కు మధ్య సరైన బ్యాలెన్స్ ఉండటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న బీసీసీఐ వికెట్ నుంచి బ్యాటర్లతో పాటు బౌలర్లకు కూడా హెల్ప్ లభించేలా కొత్త పిచ్​లను తయారు చేస్తోంది. వీటినే హైబ్రిడ్ పిచ్​లుగా పిలుస్తున్నారు. సిస్​గ్రాస్ అనే సంస్థ రూపొందిస్తున్న ఈ పిచ్​లు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఈ ట్రాక్స్​లో న్యాచులర్ గ్రాస్​తో పాటు 5 శాతం పాలిమర్ కూడా కలసి ఉంటుంది. దీంతో పేసర్లు కన్​సిస్టెంట్​గా బౌన్స్ రాబట్టొచ్చు. వికెట్ చాలా సేపటి వరకు తాజాగా ఉంటుంది. కాబట్టి బౌలర్లు ఎఫెక్టివ్​గా బౌలింగ్ చేయొచ్చు.

హైబ్రిబ్ పిచ్​లను తొలుత ధర్మశాల స్టేడియంలో వినియోగించనున్నారు. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మే 5వ తేదీన జరిగే మ్యాచ్​తో ఈ ప్రయోగం మొదలవనుంది. ఇదే గ్రౌండ్​లో చెన్నై సూపర్ కింగ్స్​తో మే 9వ తేదీన తలపడనుంది పంజాబ్. ధర్మశాలను సెకండ్ హోమ్ గ్రౌండ్​గా ఎంచుకున్న పంజాబ్.. ఇక్కడ రెండు మ్యాచుల్లోనూ హైబ్రిడ్ వికెట్ల మీదే ఆడనుంది. ఐసీసీ కూడా వన్డేలు, టీ20ల్లో ఈ పిచ్​ల వాడకానికి ఓకే చెప్పడంతో త్వరలో ఇంటర్నేషనల్ లెవల్​లోనూ ఇలాంటి వికెట్ల మీద మ్యాచ్​లు జరిగే ఛాన్సులు ఉన్నాయి. ఈ ప్రయోగం ఐపీఎల్​లో ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ఇలాంటి పిచ్​లు పెరుగుతాయి. అప్పుడు బ్యాటర్లకు దబిడిదిబిడే. మరి.. బీసీసీఐ సరికొత్త ప్రయోగం గురించి మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments