Nidhan
ఓడిన బాధలో ఉన్న గుజరాత్‌కు, హై స్కోరింగ్ ఫైట్‌లో గెలిచి జోష్‌లో ఉన్న హైదరాబాద్‌కు మధ్య మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మరి.. ఈ టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఓడిన బాధలో ఉన్న గుజరాత్‌కు, హై స్కోరింగ్ ఫైట్‌లో గెలిచి జోష్‌లో ఉన్న హైదరాబాద్‌కు మధ్య మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మరి.. ఈ టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Nidhan
టోర్నీలో మంచి స్టార్ట్ అందుకున్నాక కూడా నెక్స్ట్ మ్యాచ్‌లో ఓడి నిరాశలో ఉందో టీమ్. ఇంకో జట్టేమో తొలి మ్యాచ్‌లో కొద్ది తేడాతో ఓడినా.. రెండో మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సాధించి ఫుల్ జోష్‌లో ఉంది. ఆ రెండు టీమ్సే గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్. ఫస్ట్ మ్యాచ్‌లో ముంబై మీద 6 పరుగుల తేడాతో విక్టరీ కొట్టిన జీటీ.. సెకండ్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో 63 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో సక్సెస్ ట్రాక్‌లోకి రావడం ఆ టీమ్‌కు కంపల్సరీగా మారింది. మరోవైపు తొలి మ్యాచ్‌లో కోల్‌కతా చేతితో 4 పరుగుల తేడాతో ఓడింది సన్‌రైజర్స్. అయితే ఉత్కంఠభరితంగా సాగిన రెండో మ్యాచ్‌లో 31 రన్స్ తేడాతో నెగ్గింది. జీటీ మీద కూడా గెలిచి ఇదే జోరును కంటిన్యూ చేయాలని కమిన్స్ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు టీమ్స్ మధ్య జరగనున్న సండే ఫైట్‌లో ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
గుజరాత్‌ను అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ఆ టీమ్‌లో ప్లస్సుల కంటే మైనస్‌లే ఎక్కువగా ఉన్నాయి. ఓపెనింగ్ జోడీ సాహా-గిల్ ఫెయిలవుతున్నారు. శుబ్‌మన్ నుంచి ఇప్పటిదాకా భారీ ఇన్నింగ్స్ ఒక్కటీ రాలేదు. విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, ఒమర్జాయి, రాహుల్ తెవాటియా ఇలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నా ఒక్కరూ స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. సాయి సుదర్శన్ మంచి ఫామ్‌లో ఉండటం ఆ టీమ్‌కు కలిసొచ్చే అంశం. బ్యాటింగ్ యూనిట్ ఈ జట్టుకు బిగ్ మైనస్. బౌలింగ్‌లో రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తప్ప ఎవరూ కన్సిస్టెంట్గా పెర్ఫార్మ్ చేయడం లేదు.
ఈసారి ఐపీఎల్ కప్పు కొట్టాలన్న కసిలో ఉన్న సన్‌రైజర్స్ చాలా కొత్తగా కనిపిస్తోంది. ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు ఓడినా, గెలిచినా జట్టు అటాకింగ్ మోడ్‌లో ఆడుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఆ టీమ్ ప్రధాన బలం బ్యాటింగే. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్రమ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీళ్లకు తోడు మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్ కూడా రాణిస్తే టీమ్‌కు తిరుగుండదు. ముంబైతో హైస్కోరింగ్ మ్యాచ్‌లో అభిషేక్, హెడ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీలతో విధ్వంసం సృష్టించారు. వీళ్లు ఇదే దూకుడును కంటిన్యూ చేయాలని టీమ్ కోరుకుంటోంది. ఎస్ఆర్హెచ్కు మరో బలం కెప్టెన్ కమిన్స్. రెండు మ్యాచుల్లో కలిపి 3 వికెట్లే తీసినా అతడు పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. బౌలింగ్ ఛేంజెస్లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. కమిన్స్‌తో పాటు జయ్‌దేవ్ ఉనాద్కట్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇతర బౌలర్లు కూడా రిథమ్‌ను అందుకుంటే ఎస్ఆర్హెచ్ను ఆపలేరు.
రెండు జట్ల బలాబలాలను బట్టి ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నెగ్గడం ఖాయం. ఈ ఇరు టీమ్స్ ఇప్పటిదాకా 3 సార్లు తలపడ్డాయి. ఇందులో రెండుసార్లు జీటీ నెగ్గగా.. ఒకమారు ఎస్ఆర్హెచ్ గెలిచింది. అయితే హైదరాబాద్ బ్యాటర్లు ఇప్పుడు నెక్స్ట్ లెవల్ ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లు ప్రత్యర్థులను బాగా కట్టడి చేస్తున్నారు. అటు గుజరాత్ మాత్రం బ్యాటింగ్ ఫెయిల్యూర్‌తో ఇబ్బంది పడుతోంది. ఆ టీమ్ బౌలింగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే రేపటి మ్యాచ్‌లో జీటీని ఎస్ఆర్హెచ్ కుమ్మేయడం పక్కా.
గుజరాత్:
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయి, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్.
హైదరాబాద్:
ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్.