Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డును గుజరాత్ టైటాన్స్ బద్దలు కొట్టింది. సీఎస్కేతో మ్యాచ్‌లో జీటీ అరుదైన ఘనతను అందుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డును గుజరాత్ టైటాన్స్ బద్దలు కొట్టింది. సీఎస్కేతో మ్యాచ్‌లో జీటీ అరుదైన ఘనతను అందుకుంది.
Nidhan
ప్లేఆఫ్స్ రేసు నుంచి టెక్నికల్‌గా తప్పుకున్న గుజరాత్ టైటాన్స్.. ఇప్పుడు పోయిన పరువును నిలబెట్టుకునే పనిలో ఉంది. అందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో నెక్స్ట్ లెవల్ హిట్టింగ్తో అదరగొడుతోంది. ఈ మ్యాచ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డును కూడా జీటీ బ్రేక్ చేసింది. సీఎస్కేతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆ జట్టు ఓపెనర్లు సాయి సుదర్శన్ (46 బంతుల్లో 94 నాటౌట్), శుబ్‌మన్ గిల్ (44 బంతుల్లో 93 నాటౌట్) బాదుడే పనిగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను అందుకున్నారు.
సాయి సుదర్శన్-శుబ్‌మన్ గిల్ కలసి ఫస్ట్ వికెట్‌కు 15 ఓవర్లలోనే 190 పరుగులు జోడించారు. తద్వారా ఈ సీజన్లో తొలి వికెట్‌కు ఎస్ఆర్హెచ్ (ట్రావిస్ హెడ్-అభిషేక్ శర్మ) 167 పరుగుల భాగస్వామ్యం రికార్డును బద్దలు కొట్టారు. ఈ లిస్ట్‌లో ఆర్సీబీ (విరాట్ కోహ్లీ-విల్ జాక్స్) 166 పరుగులు మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ హిస్టరీలో అత్యంత వేగంగా 1,000 పరుగుల్ని పూర్తి చేసుకున్న భారతీయ ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచాడు. అతడు 25 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్ (31 ఇన్నింగ్స్‌లు) రికార్డును అతడు బ్రేక్ చేశాడు.