iDreamPost
android-app
ios-app

DC vs LSG: వీడియో: కేఎల్ రాహుల్ కళ్లుచెదిరే క్యాచ్.. మిస్సైనా చిరుతలా వెంటాడి పట్టేశాడు!

  • Published May 14, 2024 | 8:43 PMUpdated May 14, 2024 | 8:53 PM

లక్నో సూపర్ జియాంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్ క్యాచ్​తో ఆకట్టుకున్నాడు. మిస్సైన క్యాచ్​ను చిరుతలా వెంటాడి మరీ పట్టుకున్నాడు.

కేఎల్ రాహుల్ అంటే అందరికీ ముందు బ్యాటింగే గుర్తుకొస్తుంది. కానీ రాహుల్​లో బ్యాటర్​తో పాటు అద్భుతమైన వికెట్ కీపర్, సూపర్ ఫీల్డర్ కూడా ఉన్నాడు. వికెట్ల వెనుక కఠినమైన క్యాచ్​లు అందుకోవడంలో అతడు సిద్ధహస్తుడు. కీపింగ్ అవకాశం లేనప్పుడు ఫీల్డర్​గా కూడా అదరగొడుతుంటాడు రాహుల్. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో తన ఫీల్డింగ్ ప్రతిభను అతడు బయటపెట్టాడు. డీసీ బ్యాటర్ షై హోప్ (38) ఇచ్చిన క్యాచ్​ను కళ్లుచెదిరే రీతిలో అందుకున్నాడు.

రవి బిష్ణోయ్ బౌలింగ్​లో షై హోప్ కవర్స్ దిశగా బలంగా షాట్ కొట్టాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్​ చేతుల్లోకి బాల్ వెళ్లింది. బాల్ అనూహ్యమైన వేగంతో దూసుకురావడంతో దాన్ని అందుకోవడంలో రాహుల్ ఫెయిలయ్యాడు. బాల్ చిక్కినట్టే చిక్కి చేతుల్లో నుంచి జారిపోయింది. అయినా పట్టువదలని రాహుల్ వెంటాడి మరీ చిరుతలా పరిగెత్తి క్యాచ్​ను అందుకున్నాడు. సూపర్ డైవ్​తో బాల్​ను పట్టేశాడు. దీంతో బతికిపోయానని అనుకున్న హోప్.. నిరాశతో క్రీజును వీడాడు. మరి.. రాహుల్ క్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి