ఈరోజు RCB vs CSK వార్! బెంగుళూరులో వర్షం పడే ఛాన్స్? వాతావరణ శాఖ రిపోర్ట్ ఇది!

IPL 2024 CSK Vs RCB: ఐపీఎల్‌ 2024లో నేడు బెంగళూరు వేదికగా రసవత్తర మ్యాచ్‌ జరగనుంది. ఆర్‌సీబీ వర్సెస్‌ సీఎస్‌కే మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రిపోర్ట్‌ ఆందోళన కలిగిస్తోంది. ఆ వివరాలు..

IPL 2024 CSK Vs RCB: ఐపీఎల్‌ 2024లో నేడు బెంగళూరు వేదికగా రసవత్తర మ్యాచ్‌ జరగనుంది. ఆర్‌సీబీ వర్సెస్‌ సీఎస్‌కే మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రిపోర్ట్‌ ఆందోళన కలిగిస్తోంది. ఆ వివరాలు..

ఐపీఎల్‌ 2024 ప్లేఆఫ్స్‌ లిస్ట్‌లో ఇప్పటికే మూడు జట్లు స్థానం సంపాదించుకున్నాయి. కేకేఆర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు మూడు కూడా ప్లే ఆఫ్‌కు చేరుకున్నాయి. ఇక శనివారం నాడు చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య రసవత్తర మ్యాచ్‌ జరగనుంది. నేటి మ్యాచ్‌ ద్వారా.. ప్లేఆఫ్‌కు చేరుకునే నాలుగో జట్టు ఏదో తెలియనుంది. ఆర్‌సీబీ వర్సెస్‌ సీఎస్‌కే మ్యాచ్‌కి.. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. నేటి రాత్రి 7.30 గంటలు మ్యాచ్‌ జరనగుంది. అయితే నేటి మ్యాచ్‌లో విజేతను వర్షం డిసైడ్‌ చేసే అవకాశలే అధికం అంటున్నారు.

నేడు ఆర్సీబీ, సీఎస్‌కేల మధ్య బెంగళూరులో మ్యాచ్‌ జరుగుతున్న నేపథ్యంలో బెంగళూరు వాతావరణ శాఖ నివేదిక కీలకంగా మారింది. ఈ రసవత్తర పోరుకు వరుణుడు ఆటంకం కలిగించవచ్చని వాతావరణ శాఖ నివేదికను చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతానికి బెంగళూరులో పొడి వాతావరణమే ఉంది. కానీ సాయంత్ర, రాత్రి సమయానికి బెంగళూరులో ఊరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం, రాత్రి లోపు బెంగళూరులో వర్షం కురవడానికి 90 శాతం ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దాంతో ఆర్సీబీ వర్సెస్‌ సీఎస్‌కే మ్యాచ్‌లో వరుణుడు, ఈదురు గాలులు కీలకంగా మారనున్నాయి. దీంతో పాటు చిన్న స్వామి స్టేడియంలోని డ్రేనేజీవ్యవస్థ కూడా నేటి మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించనుంది. ఇక చిన్న స్వామి స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ అద్భుతంగా ఉంటుందని.. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఒకవేళ ఈ రోజు బెంగళూరులో భారీ వర్షం కురిసి మ్యాచ్‌ రద్దైతే ఆర్సీబీ ఇక ఇంటి దారి పట్టాల్సిందే.

అయితే నేటి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చిన్నస్వామి స్టేడియం వర్గాలు వెల్లడిస్తున్నారు. వర్షం గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. ఒకవేళ నేడు వాన వచ్చినా.. కేవలం 30 నిమిషాల్లో గ్రౌండ్‌ను రెడీ చేసేలా చిన్నస్వామి స్టేడియంలో డ్రైనేజ్‌ సిస్టమ్‌ ఉందని.. కనుక నేటి మ్యాచ్‌ నిర్వహణ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. మరి నేటి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments