Nidhan
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఓ టీమిండియా మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు చేశాడు. ధోని ఆడటం మానేసి ఇంట్లో కూర్చోవాలని అన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఓ టీమిండియా మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు చేశాడు. ధోని ఆడటం మానేసి ఇంట్లో కూర్చోవాలని అన్నాడు.
Nidhan
డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న సమయంలో అద్భుతమైన గెలుపును నమోదు చేసింది గైక్వాడ్ సేన. ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్కే అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. ఈ గెలుపుతో సీఎస్కే పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్‌కు ఎగబాకింది. అయితే చెన్నై నెగ్గినా గానీ ఎంఎస్ ధోని ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి.
ఐపీఎల్-2024లో ధోని ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చి అదరగొడుతున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచుల్లో 110 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 224గా ఉంది. చివరి రెండు, మూడు ఓవర్లు ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి ధనాధన్ షాట్లతో టీమ్ భారీ స్కోర్లు అందుకోవడానికి హెల్ప్ చేస్తున్నాడు. అయితే మాహీ ఉన్న ఫామ్‌కు, నీళ్లు తాగినంత ఈజీగా బౌండరీలు, సిక్సులు కొడుతున్న పద్ధతికి కాస్త ముందే బ్యాటింగ్‌కు వస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మోకాలి గాయం నుంచి పూర్తిగా రికవరీ అవకపోవడంతో అతడు 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నాడు. నిన్న పంజాబ్‌తో మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో ఆడాడు. దీంతో అతడిపై టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ విమర్శలకు దిగారు.
ఎంఎస్ ధోని ఇలాగే నంబర్ 9లో బ్యాటింగ్‌కు దిగాలని భావిస్తే అతడి బదులు మంచి బౌలర్‌ను టీమ్‌లోకి తీసుకుంటే సరిపోతుందని భజ్జీ అన్నాడు. ఆ ప్లేస్‌లో ఓ బౌలర్‌ను ఆడిస్తే వికెట్లు తీయడంతో పాటు ఆఖర్లో వచ్చి కొన్ని పరుగులు చేస్తాడు కదా.. అలాంటప్పుడు జట్టులో మాహీ అవసరం ఏం ఉందని ఇన్‌డైరెక్ట్‌గా క్వశ్చన్ చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో పైకి వచ్చి ఆడలేనప్పుడు ధోని ఆడటం ఎందుకని ప్రశ్నించాడు. మాహీ ఆడటం మానేసి ఇంట్లో కూర్చోవాలని టర్బనేటర్ సూచించాడు. ధోని 9వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం చెన్నైకి మంచిది కాదని.. రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరింత ముందుకు వచ్చి ఆడాలని పఠాన్ అన్నాడు. ఒకట్రెండు ఓవర్లు ఆడితే టీమ్‌కు ఏమాత్రం లాభిందని స్పష్టం చేశాడు. మరి.. ధోని ఆడటం మానేయాలంటూ భజ్జీ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.