CSK vs LSG: చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని వల్ల కానిది సాధించాడు!

చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఇన్నాళ్లూ సీఎస్​కేకు సారథిగా ఉన్న ఎంఎస్ ధోని వల్ల కానిది అతడు సాధించి చూపించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఇన్నాళ్లూ సీఎస్​కేకు సారథిగా ఉన్న ఎంఎస్ ధోని వల్ల కానిది అతడు సాధించి చూపించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ధోని వల్ల కానిది అతడు సాధించి చూపించాడు. లక్నో సూపర్ జియాంట్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో సెంచరీ బాదాడు రుతురాజ్. 55 బంతుల్లో 100 పరుగుల మార్క్​ను అందుకున్నాడు. హాఫ్ సెంచరీకి చేరుకునేందుకు 28 బంతులు తీసుకున్న సీఎస్​కే సారథి.. తదుపరి 27 బంతులు ఆడి సెంచరీ మార్క్​ను రీచ్ అయ్యాడు. ఈ క్రమంలో 11 బౌండరీలతో పాటు 3 భారీ సిక్సులు బాదాడు. ఈ మ్యాచ్​తో అరుదైన ఘనత అందుకున్నాడు రుతురాజ్.

సెంచరీ కొట్టిన చెన్నై జట్టు తొలి కెప్టెన్​గా నిలిచాడు రుతురాజ్. ధోని ఇన్నేళ్ల పాటు కెప్టెన్​గా ఉన్నా ఏనాడూ సెంచరీ కొట్టలేదు. కానీ రుతురాజ్ సారథ్య బాధ్యతలు తీసుకున్న ఫస్ట్ సీజన్​లోనే శతకం బాదేశాడు. ఓవరాల్​గా సెంచరీ కొట్టిన ఐపీఎల్ కెప్టెన్స్​లో ఎనిమిదో వాడిగా నిలిచాడు. అతడి కంటే ముందు కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్, వీరేంద్ర సెహ్వాగ్, సంజూ శాంసన్, విరాట్ కోహ్లీ, ఆడమ్ గిల్​క్రిస్ట్, సచిన్ టెండూల్కర్​ కెప్టెన్స్​గా ఉంటూ సెంచరీలు బాదారు. సారథిగా ఉంటూ ఎక్కువ శతకాలు కొట్టిన ఘనత మాత్రం కింగ్ కోహ్లీ (5 సెంచరీలు)కే దక్కుతుంది. మరి.. రుతురాజ్ సెంచరీపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments