Nidhan
చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లను భయపెడుతోంది. అయితే ఆ టీమ్ సక్సెస్‌లో ఇద్దరు రూ.2 కోట్ల ఆటగాళ్లు కీలకపాత్ర పోషిస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లను భయపెడుతోంది. అయితే ఆ టీమ్ సక్సెస్‌లో ఇద్దరు రూ.2 కోట్ల ఆటగాళ్లు కీలకపాత్ర పోషిస్తున్నారు.
Nidhan
క్రికెటర్లపై ఐపీఎల్ కోట్ల వర్షం కురిపిస్తోంది. సత్తా ఉన్న ఆటగాళ్ల కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా ఫ్రాంచైజీలు వెనుకాడటం లేదు. ఇంటర్నేషరనల్ స్టార్స్ మాత్రమే కాదు.. డొమెస్టిక్ ప్లేయర్లు కూడా క్యాష్ రిచ్ లీగ్ వేలంలో ఊహించని ధరకు అమ్ముడుపోయి ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే కోట్లు పెట్టేసి తోపు ఆటగాళ్లను తీసుకుంటే సరిపోదు.. వాళ్లు పెర్ఫార్మ్ చేయాలి. అప్పుడే ఆయా జట్లు వాళ్ల మీద పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కు ఓ మీనింగ్ ఉంటుంది. వేలంలో భారీ ధర పలికిన ఆటగాళ్ల మీద సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఎలాగైనా రాణించాలి, తమ మీద పెట్టిన రేట్‌కు న్యాయం చేయాలనే ప్రెజర్ ఉంటుంది. దీంతో వాళ్లు ఫెయిలవుతుంటారు. అయితే ఆక్షన్‌లో తక్కువ ధర పలికిన వారి మీద ఈ ఒత్తిడి ఉండదు. అందుకే వాళ్లు గ్రౌండ్లో ఇరగదీస్తుంటారు. ఈసారి ఐపీఎల్లో ఇద్దరు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్స్ ఇలాగే తమ పెర్ఫార్మెన్స్తో దుమ్మురేపుతున్నారు.
ఐపీఎల్-2024లో సీఎస్కే వరుస విజయాలతో జోరు మీద ఉంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించిన రుతురాజ్ సేన.. రెండో మ్యాచ్‌లో పటిష్టమైన గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్‌తో పాయింట్స్ టేబుల్లో టాప్‌లో ఉంది. పించ్ హిట్టర్ శివమ్ దూబె చెలరేగుతూ టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే సరిగ్గా గమనిస్తే చెన్నై గెలుపులో మరో ఇద్దరు ప్లేయర్లు ఇంపార్టెంట్‌గా మారారు. వాళ్లే స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్. ఓపెనర్‌గా రెండు మ్యాచుల్లోనూ రచిన్ సక్సెస్ అయ్యాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో 15 బంతుల్లో 37 పరుగులు చేసి జట్టుకు సూపర్బ్ స్టార్ట్ అందించాడు. గుజరాత్ మీద కూడా 20 బంతుల్లో 46 పరుగులు చేసి భారీ స్కోరుకు పునాదులు వేశాడు. ఈ రెండు మ్యాచుల్లో అతడు బంతితో పలు ఓవర్లు వేశాడు. వికెట్లు తీయకపోయినా పరుగులు కట్టడి చేస్తూ అపోజిషన్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు.
స్పీడ్‌స్టర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా సీఎస్కే విజయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. జీటీ మీద కూడా 2 వికెట్లతో సత్తా చాటాడు. చెన్నై సక్సెస్‌లో కీలకంగా మారిన ఈ ఇద్దరు ప్లేయర్లకు వేలంలో దక్కిన మొత్తం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఆక్షన్‌లో ముస్తాఫిజుర్‌ను రూ.2 కోట్లకు, రచిన్‌ను రూ.1.80 కోట్ల ధరకు సీఎస్కే దక్కించుకుంది. ఇతర ఫ్రాంచైజీల నుంచి పోటీ లేకపోవడంతో వీళ్లను తక్కువ రేటుకే సొంతం చేసుకుంది. ఇప్పుడు వాళ్లే టీమ్‌లో కీలకంగా మారారు. అదే కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చూసుకుంటే మినీ వేలంలో రూ.24.75 కోట్ల రికార్డు ధరకు మిచెల్ స్టార్క్‌ను తీసుకుంది. కానీ ఏం లాభం స్టార్క్ తొలి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై 4 ఓవర్లు వేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో నెటిజన్స్ అతడ్ని ట్రోల్ చేస్తున్నారు. రికార్డు ధర పెట్టి కొనుక్కున్న స్టార్క్ వేస్ట్ అని.. రచిన్, ముస్తాఫిజుర్ ముందు అతడు జుజుబీ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రచిన్, ముస్తాఫిజుర్ పెర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.