నిన్న మ్యాచ్ లో బయటపడ్డ దొంగ ఫ్యాన్స్! ఈ కర్మ SRHకి మాత్రమే!

SRH Fake Fans- SRH vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అన్ని జట్ల ఫ్యాన్స్ ఒకెత్తు అయితే.. హైదరాబాద్ జట్టు ఫ్యాన్స్ మరో ఎత్తు అనే చెప్పాలి. ఎందుకంటే వాల్లు ఎప్పుడు జట్టుకు సపోర్ట్ చేస్తారో? ఎప్పుడు జెర్సీ మార్చేస్తారో వాళ్లకే తెలియట్లేదు.

SRH Fake Fans- SRH vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అన్ని జట్ల ఫ్యాన్స్ ఒకెత్తు అయితే.. హైదరాబాద్ జట్టు ఫ్యాన్స్ మరో ఎత్తు అనే చెప్పాలి. ఎందుకంటే వాల్లు ఎప్పుడు జట్టుకు సపోర్ట్ చేస్తారో? ఎప్పుడు జెర్సీ మార్చేస్తారో వాళ్లకే తెలియట్లేదు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ప్రతి జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థులపై విజయమే లక్ష్యంగా మైదానంలోకి అడుగు పెట్టింది మొదలు వ్యూహాలు రచిస్తూ విరుచుకుపడుతున్నారు. అయితే మ్యాచ్ అన్న తర్వాత ఒకరికి విజయం మరొకరికి ఓటమి తప్పదు. జట్టు మాత్రం విజయం కోసమే పోరాడుతూ ఉంటుంది. అలాగే ఆ జట్టును సపోర్ట్ చేసే ఫ్యాన్స్ కూడా తమ అభిమాన జట్టు గెలవాలి అని కోరుకుంటారు. మైదానికి వెళ్లి, టీవీల ముందు కూర్చుని చీర్ చేస్తూ ఉంటారు. గెలిస్తే సంతోషం.. ఓడితే మరో మ్యాచ్ లో గెలవచ్చు అంటూ వారి మద్దతు తెలియజేస్తూ ఉంటారు. కానీ, సన్ రైజర్స్ టీమ్ పరిస్థితి అలా లేదు. గెలిస్తే మా టీమ్ అని.. ఓడితే పగోళ్లు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఆర్సీబీతో మ్యాచ్ లో అది స్పష్టంగా కనిపించింది.

తెలుగులో ఒక సామెత ఉంటుంది. ‘నవ్వినంతసేపు నా కొడుకని.. ఏడవగానే అమ్మ కొడుకు అంటారు’. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి అలాంటి గడ్డుకాలమే నడుస్తోంది. వరుసగా 250+ పరుగులు చేసినప్పుడు అంతా మా జట్టు మా జట్టు అంటూ తెగ భుజాన ఎత్తుకున్నారు. మా హైదరాబాద్ జట్టుని కొట్ట గలిగేవాడు లేడు అంటూ బీరాలు పోయారు. గురువారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఆర్సీబీతో మ్యాచ్ లో మాత్రం వెంటనే ప్లేట్ ఫిరాయించారు. ఆర్సీబీ గెలుస్తోంది అని తెలియగానే అంతా పార్టీ మార్చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దొంగ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఉప్పల్ స్టేడియం చూస్తే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లా అనిపించింది.

అలా అనడానికి కూడా కారణం లేకపోలేదు. సాధారణంగా హౌమ్ గ్రౌండ్ లో మ్యాచ్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కి అత్యధికంగా సపోర్ట్ ఉండాలి. కానీ, నిన్న ఉప్పల్ స్టేడియం మొత్తం ఆర్సీబీ స్లోగన్స్ తో మారుమోగిపోయింది. రెండు జెర్సీలు తీసుకెళ్లి హైదరాబాద్ గెలిస్తే.. సన్ రైజర్స్ అని, ఆర్సీబీ గెలవగానే నమ్మ బెంగళూరు అనే దొంగ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. ఆడినంతసేపు మాత్రం వారు సన్ రైజర్స్ కి సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైతో ఓడి పోతుందో.. అప్పుడు వెంటనే జెర్సీ మార్చేస్తారు. నిజానికి ఐపీఎల్ ఎవరు ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు? ఎవరికి సపోర్ట్ చేయాలి? అనే విషయాన్ని ఎవరూ నిర్ణయించడానికి లేదు.

సామాన్యంగా రాష్ట్రాల వారీగా కూడా తమ జట్టు గెలవాలి అని కోరుకుంటారు. తమిళనాడు మొత్తంలో దాదాపుగా చెన్నై, కర్ణాటకలో దాదాపుగా బెంగళూరుకు ఎలా మద్దతు ఉంటుందో.. హైదరాబాద్ లో మ్యాచ్ జరిగితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతు ఉంటుంది అనుకుంటారు. నిజానికి స్టార్టింగ్ లో అలాగే ఉంది. ఆర్సీబీ వికెట్స్ పడుతున్నంతసేపు హైదరాబాద్ అన్నారు. ఆ తర్వాత వెంటనే మాట మార్చేసి మా ఆర్సీబీ అన్నారు. ఈ కర్మ ఒక్క SRHకి తప్పితే మరో టీమ్ కు ఉండదు. ఆర్సీబీతో మ్యాచ్ లో బయటపడ్డ దొంగ ఫ్యాన్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments