వీడియో: ఒక్క క్యాచ్ తో చెన్నై ఓటమిని శాసించిన డుప్లెసిస్..

RCB vs CSK- Faf Du Plessis Superman Catch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆర్సీబీ ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. ఈ ఉత్కంఠ బరిత పోరులో ఆర్సీబీ అనూహ్య విజయాన్ని నమోదు చేసింది.

RCB vs CSK- Faf Du Plessis Superman Catch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆర్సీబీ ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. ఈ ఉత్కంఠ బరిత పోరులో ఆర్సీబీ అనూహ్య విజయాన్ని నమోదు చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో మహా అద్భుతం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ చరిత్రలోనే మర్చిపోలేని ఒక ఫలితాన్ని తమ అభిమానులకు ఇచ్చింది. నిజానికి అందరూ ఈ విజయాన్నే కోరుకున్నారు. అటు ఆర్సీబీ జట్టు.. ఇటు ఐపీఎల్ అభిమానులు కూడా వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అని కలలు కన్నారు. అందరూ కోరుకున్నట్లుగానే ఆర్సీబీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఒక అద్భుతమైన క్యాచ్ తో డుప్లెసిస్ చెన్నై మ్యాచ్ ఫలితాన్నే మార్చేశాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 39 ఏళ్ల వయసులో ఇలాంటి క్యాచ్ అంటే అస్సలు నమ్మలేరు కూడా.

ఆర్సీబీ మ్యాచ్ అద్భుమైన విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠ పోరులో ఏకంగా 27 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఘన విజయాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తన ప్రదర్శనతో అందరినీ అబ్బుర పరిచాడు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆర్సీబీ జట్టుకు వర్షం రూపంలో కష్టం వచ్చింది. కానీ, కోహ్లీ- డుప్లెసిస్ కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడారు. కోహ్లీ 3 పరుగుల్లో అర్ధ శతకాన్ని కోల్పోయాడు. కానీ, డుప్లెసిస్ మాత్రం 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 54 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ జట్టు స్కోర్ 200 దాటడానికి బాగా హెల్ప్ అయ్యింది. పైగా తర్వాత వచ్చిన బ్యాటర్లు కాస్త ఫ్రీగా బ్యాటింగ్ చేసేందుకు వీలు కలిగింది.

ఒక బ్యాటింగ్ మాత్రమే కాకుండా. డుప్లెసిస్ తన ఫీల్డింగ్ స్కిల్స్ తో కూడా ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఫాఫ్ డుప్లెసిస్ పట్టిన ఒక్క క్యాచ్ దాదాపుగా మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. 14.6 ఓవర్లో సిరాజ్ వేసిన లో ఫుల్ టాస్ ని మిచెల్స్ శాంట్నర్ కొట్టిన ఒక భారీ షాట్ ను దాదాపుగా గాల్లోకి ఎగిరి డుప్లెసిస్ క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 39 ఏళ్ల వయసులో డుప్లెసిస్ పట్టిన ఈ క్యాచ్ కు కోహ్లీ మాత్రమే కాదు.. జట్టు, అభిమానులు మొత్తం షాకయ్యారు. పైగా ఈ క్యాచ్ వల్లే మ్యాచ్ గెలిచింది అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే శాంటర్నర్ కచ్చితంగా భారీ షాట్స్ ఆడగలడు అలాంటి వాడిని కేవలం 3 పరుగులకే పెవిలియన్ చేర్చడం అంటే మామూలు విషయం కాదు.

అలా శాంట్నర్ ని అవుట్ చేయబట్టే ఫలితం వారికి అనుకూలంగా వచ్చింది. ఇంక మ్యాచ్ సమురీ చూస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఛేజింగ్ దిగిన చెన్నై జట్టు ఆఖర్లో తడబడింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో ఆర్సీబీ జట్టు టేబుల్ లాస్ట్ పొజిషన్ నుంచి ఏకంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. మొత్తానికి ఆర్సీబీ పని అయిపోయింది అనుకున్న వాళ్లందరికీ గట్టి రిప్లయ్ అయితే ఇచ్చారు. మరి.. డుప్లెసిస్ పట్టిన ఈ క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments