IPL 2024.. ఢిల్లీని వెంటాడుతున్న బ్యాడ్ లక్! గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్!

IPL 2024 స్టార్టింగ్ ముందే ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ టోర్నీకి దూరం కాగా.. తాజాగా గాయంతో మరో స్టార్ ప్లేయర్ సీజన్ కు అందుబాటులో లేకుండాపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2024 స్టార్టింగ్ ముందే ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ టోర్నీకి దూరం కాగా.. తాజాగా గాయంతో మరో స్టార్ ప్లేయర్ సీజన్ కు అందుబాటులో లేకుండాపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికంటే ముందే ఫ్రాంచైజీలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి గాయాలు. ఇప్పటికే పలు టీమ్స్ కు చెందిన ప్లేయర్లు ఇంజ్యూరీస్ కారణంగా ఈ మెగాటోర్నీకి దూరమైయ్యారు. అయితే మరీ ముఖ్యంగా ఢిల్లీని దురదృష్టం వెంటాడుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు స్టార్ ప్లేయర్లను కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ కు చెందిన స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ టోర్నీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా డీసీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ పేసర్ ఈ టోర్నీకి పూర్తిగా దూరమైయ్యాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు..

ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కాకముందే.. ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే తన అమ్మమ్మ మరణించడంతో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఈ మెగాటోర్నీకి దూరం కాగా.. ఇప్పుడు మరో స్టార్ ప్లేయర్ గాయంతో సీజన్ మెుత్తానికే దూరమైయ్యాడు. లేటెస్ట్ గా సౌతాఫ్రికా స్టార్ పేసర్ లుంగి ఎంగిడి ఇంజ్యూరీ అయ్యాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ మెుత్తానికే అతడు ఆడటానికి అవకాశం లేకుండా పోయింది. ఇది ఢిల్లీ పెద్ద దెబ్బే. ఇక ఇతడి ప్లేస్ లో స్పిన్ ఆల్ రౌండర్ అయిన ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు జాక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ ను రీ ప్లేస్ మెంట్ చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

అయితే తొలుత బ్రూక్ ప్లేస్ లో ఈ ఆసీస్ తురుపుముక్కను తీసుకున్నారని వార్తలు వచ్చినా అవి నిజం కాదు. ఎంగిడి స్థానంలో ఫ్రేజర్ ను తీసుకున్నారు. రూ. 50 లక్షల బేస్ ధరకు అతడిని టీమ్ లోకి తీసుకుంది ఢిల్లీ. కాగా.. గత సంవత్సరం కేవలం 29 బంతుల్లోనే శతకం బాది ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఇదిలా ఉండగా.. బ్రూక్ ప్లేస్ లో ఎవరిని టీమ్ లోకి తీసుకుంటున్నారో ఇంకా ప్రకటించలేదు ఢిల్లీ యాజమాన్యం. మార్చి 23న పంజాబ్ కింగ్స్ తో తలపడబోతోంది డీసీ జట్టు. రిషబ్ పంత్, ఆన్రిచ్ నోకియా, మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, కుల్దీప్ యాదవ్ లో ఢిల్లీ టీమ్ పటిష్టంగానే కనిపిస్తోంది.

ఇదికూడా చదవండి: బుమ్రా-పాండ్యాను కాపాడింది రోహిత్ శర్మనే.. సంచలన నిజాలు బయటపెట్టిన పార్థివ్ పటేల్!

Show comments