Nidhan
లక్నో సూపర్ జియాంట్స్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు యంగ్ బ్యాటర్ అభిషేక్ పోరెల్. పిచ్చకొట్టుడు కొడుతూ వాళ్లను భయపెట్టాడు.
లక్నో సూపర్ జియాంట్స్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు యంగ్ బ్యాటర్ అభిషేక్ పోరెల్. పిచ్చకొట్టుడు కొడుతూ వాళ్లను భయపెట్టాడు.
Nidhan
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. లక్నో సూపర్ జియాంట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ టీమ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ముఖ్యంగా యంగ్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ అయితే పిచ్చకొట్టుడు కొట్టాడు. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ మొదలుపెట్టిన పోరెల్.. 21 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. ఇందులో 5 బౌండరీలతో పాటు 4 భారీ సిక్సులు ఉన్నాయి. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడాల్లేకుండా అందరి మీదా అతడు విరుచుకుపడ్డాడు.
పోరెల్‌తో పాటు స్టార్ బ్యాటర్ షై హోప్ (27 బంతుల్లో 38) కూడా సత్తా చాటాడు. వీళ్లిద్దరి మధ్య రెండో వికెట్‌కు 92 పరుగుల పార్ట్నర్షిప్ నమోదైంది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడంతో మంచి భాగస్వామ్యం అవసరమైంది. ఆ సమయంలో పోరెల్-హోప్ బాధ్యతాయుతంగా ఆడారు. హోప్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడగా.. పోరెల్ మెరుపు షాట్లతో లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. మరి.. పోరెల్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ABHISHEK POREL WITH A 21 BALL FIFTY. 🔥
In a must win game for DC – Porel steps up. A great season for Porel, he’s taking the pressure well. pic.twitter.com/uU80ZhX2WD
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 14, 2024