Nidhan
ఐపీఎల్-2024లో భీకర ఫామ్‌లో ఉన్న చెన్నై మాజీ సారథి ఎంఎస్ ధోని పంజాబ్‌తో మ్యాచ్‌లో ఫెయిలయ్యాడు. సీనియర్ పేసర్ హర్షల్ పటేల్ అతడ్ని వెనక్కి పంపించాడు.
ఐపీఎల్-2024లో భీకర ఫామ్‌లో ఉన్న చెన్నై మాజీ సారథి ఎంఎస్ ధోని పంజాబ్‌తో మ్యాచ్‌లో ఫెయిలయ్యాడు. సీనియర్ పేసర్ హర్షల్ పటేల్ అతడ్ని వెనక్కి పంపించాడు.
Nidhan
ఐపీఎల్-2024లో భీకర ఫామ్‌లో ఉన్నాడు చెన్నై మాజీ సారథి ఎంఎస్ ధోని. ఆఖర్లో రెండు, మూడు ఓవర్లు ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు దిగుతున్న మాహీ క్లీన్ హిట్టింగ్తో అదరగొడుతున్నాడు. వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీ లైన్‌కు పంపిస్తున్నాడు. భారీ సిక్సులు బాదుతూ వింటేజ్ ధోనీని గుర్తుచేస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అతడు ఇలాగే విధ్వంసం సృష్టిస్తాడని ఎల్లో ఆర్మీ ఫ్యాన్స్ అనుకున్నారు. మాహీ మాస్ హిట్టింగ్ పక్కా అని ఫిక్స్ అయ్యారు. కానీ ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు ధోని.
పంజాబ్‌తో మ్యాచ్‌లో మాహీ ఫెయిలయ్యాడు. సీనియర్ పేసర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అతడు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. వేలాది మంది చెవులు పగిలిపోయేలా అరుస్తూ చేసిన భీకర సౌండ్ మధ్య బ్యాటింగ్‌కు వచ్చిన మాహీ మొదటి బంతికే ఔట్ అవడంతో అభిమానులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. హర్షల్ పటేల్ వేసిన స్లోవర్ ఫుల్ లెంగ్త్ డెలివరీకి స్లాగ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి ధోని బౌల్డ్ అయ్యాడు. అయితే తోపు బ్యాటర్ అయిన మాహీ వికెట్ తీసినా హర్షల్ మాత్రం సెలబ్రేట్ చేసుకోలేదు. జస్ట్ రెండు చేతులు అలా పైకి ఉంచి కామ్ అయిపోయాడు. దీనికి కారణం ఏంటో తెలిస్తే అతడ్ని మెచ్చుకోవాల్సిందే. ధోని అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అందుకే అతడి వికెట్ దక్కినా సెలబ్రేట్ చేసుకోలేదని పటేల్ తెలిపాడు.
Golden Duck 🦆 for MS Dhoni 😳
Harshal Patel with a Beautiful Slower Ball 👏#PBKSvCSK pic.twitter.com/o6HIUIRF9R— Richard Kettleborough (@RichKettle07) May 5, 2024
Harshal Patel said, “I’ve had too much respect for MS Dhoni, so I didn’t celebrate much after getting his wicket”. pic.twitter.com/ZD2tTSeH0u
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2024