IPL 2024 సెకండ్ షెడ్యూల్.. మ్యాచ్ లు జరిగేవి ఎక్కడో తెలుసా?

ఐపీఎల్ 2024 సెకండ్ షెడ్యూల్ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మిగతా మ్యాచ్ లను ఎక్కడ నిర్వహిస్తారా? అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సెకండ్ షెడ్యూల్ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మిగతా మ్యాచ్ లను ఎక్కడ నిర్వహిస్తారా? అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 మెగా జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ లో భాగంగా మార్చి 22 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే రెండో ఫేజ్ కు సంబంధించి షెడ్యూల్ ను బీసీసీఐ ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో మిగతా మ్యాచ్ లు ఎక్కడ? ఎప్పటి నుంచి జరుగుతాయోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సెకండ్ షెడ్యూల్ కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ గా మారింది.

ఐపీఎల్ 2024 ఫస్ట్ షెడ్యూల్ ను ప్రకటించింది బీసీసీఐ. తొలి షెడ్యూల్ మార్చి 22న ప్రారంభమై ఏప్రిల్ 7న ముగుస్తుంది. కేవలం 21 మ్యాచ్ లకు మాత్రం ఇండియాలో ఆడనున్నారు. పూర్తి షెడ్యూల్ ప్రకటించకపోవడానికి కారణం దేశంలో పార్లమెంట్, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటమే. దీంతో సెకండ్ షెడ్యూల్ ను విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ మెుదటి నుంచి ప్లాన్ చేస్తూనే వస్తోంది. అందులో భాగంగా ఏప్రిల్, మేలో దశలవారీగా ఎన్నికలు ఉండటంతో.. సెకండ్ షెడ్యూల్ లో మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఈరోజు(శనివారం మార్చి 16)న ప్రకటిస్తుండటంతో.. సెకండ్ ఫేజ్ పై త్వరలోనే స్పష్టత రానుంది. మిగతా మ్యాచ్ లు విదేశాల్లో జరిగితే మాత్రం భారత క్రికెట్ అభిమానులకు పెద్ద షాకనే చెప్పాలి. క్రికెట్ అంటే ఎంతో పిచ్చి ఉన్న భారతీయులకు ఐపీఎల్ మ్యాచ్ లు విదేశాలకు తరలితే తీవ్ర అసంతృప్తికి గురౌతారనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

ఇదికూడా చదవండి: సూర్యకుమార్ ను గుర్తుచేసిన RCB లేడీ బౌలర్.. రివేంజ్ అదిరిందంటున్న ఫ్యాన్స్!

Show comments