Vindhya Vishaka: అక్కడ అందరి ముందే డ్రస్సులు మార్చుకోవాలి.. యాంకర్ వింధ్య షాకింగ్ కామెంట్స్!

ఐపీఎల్ లో తెలుగు తొలి యాంకర్ గా వింధ్య విశాఖ అదరగొడుతోంది. తనదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఐపీఎల్ లో తెలుగు తొలి యాంకర్ గా వింధ్య విశాఖ అదరగొడుతోంది. తనదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

యాంకర్ వింధ్య విశాఖ.. స్పోర్ట్స్ ప్రజెంటర్స్ గా మగవాళ్లే కనిపించే రోజుల్లో తన మాటలతో, చలాకీదనంతో తొలి తెలుగు క్రికెట్ వ్యాఖ్యతగా రాణిస్తోంది. తన హోస్టింగ్ తో క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఐపీఎల్ 11వ సీజన్ నుంచి వ్యాఖ్యతగా ఉంటూ.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మోడలింగ్ రోజుల గురించి పలు షాకింగ్ విషయాలు వెల్లడించింది. అక్కడ అందరి ముందే బట్టలు మార్చుకోవాలని ఈ ప్రపంచానికి తెలియని నిజాలను పంచుకుంది.

క్రికెట్.. అనగానే ఎక్కువగా మగాళ్లే గుర్తుకు వస్తారు. ఇలాంటి రంగంలో స్పోర్ట్స్ ప్రజెంటర్ గా ఓ తెలుగు అమ్మాయి దూసుకెళ్తోంది. ఐపీఎల్ లో తెలుగు యాంకర్ గా వింధ్య విశాఖ అదరగొడుతోంది. 2011 ఐపీఎల్ సీజన్ నుంచి తెలుగు క్రికెట్ యాంకర్ గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వస్తోంది. అయితే తాను మోడలింగ్ చేసే రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి తాజాగా పంచుకుంది. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లో ఓ ఫ్యాషన్ వీక్ లో పాల్గొందట వింధ్య. అదే ఆమె తొలి, చివరి షోగా మిగిలిపోయిందని ఆమె పేర్కొంది. ఈ రంగం ఆమెకు సెట్ కాదని అప్పుడే అనిపించిందట. దానికి బలమైన కారణం ఉందని కూడా చెప్పింది. అదేంటంటే?

ఫ్యాషన్ షో కోసం వచ్చిన అమ్మాయిలు దుస్తులు మార్చుకోవడానికి సరైన గదులు కూడా లేకపోవడంతో.. బ్యాక్ స్టేజ్ వద్దే అందరి ముందు బట్టలు మార్చుకోవాల్సి వచ్చేదని పేర్కొంది. ఇది ఆమె షాకైందట. దీంతో ఆ క్షణమే ఆమెకు ఈ రంగం సెట్ కాదని మోడలింగ్ వదిలేయాలని నిర్ణయం తీసుకుందట. అయితే ఇది తనకు మాత్రమే ఎదురైన అనుభవం అని చెప్పుకొచ్చింది. ఇక వింధ్యకు మూవీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వచ్చినట్లు తెలిపింది. గోపాల గోపాల, ముకుందా లాంటి చిత్రాల్లో నటించమని ఛాన్స్ లు వచ్చాయని, కానీ తనకు ఇండస్ట్రీ అంటే ఇష్టం లేకపోవడంతో, ఆసక్తి లేకపోవడంతో ఆ మూవీల్లో నటించేందుకు నో చెప్పినట్లు పేర్కొంది. మరి లేడీ క్రికెట్ యాంకర్ వింధ్య చేసిన షాకింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Show comments