వీడియో: ట్రైన్ వెళ్తుండగా నీళ్లు పోసిన ఆకతాయిలు.. చివరికిలా!

మన దేశంలో ప్రధానమైన ప్రభుత్వ వ్యవస్థల్లో రైల్వే శాఖ ఒకటి. ఇది అన్ని ప్రాంతాల్లో విస్తరించింది ఉంది. ఇక రైలులో ప్రయాణం చేసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ అనే సదుపాయలను కల్పిస్తుంది.

మన దేశంలో ప్రధానమైన ప్రభుత్వ వ్యవస్థల్లో రైల్వే శాఖ ఒకటి. ఇది అన్ని ప్రాంతాల్లో విస్తరించింది ఉంది. ఇక రైలులో ప్రయాణం చేసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ అనే సదుపాయలను కల్పిస్తుంది.

మన దేశంలో ప్రధానమైన ప్రభుత్వ వ్యవస్థల్లో రైల్వే శాఖ ఒకటి. ఇది అన్ని ప్రాంతాల్లో విస్తరించింది ఉంది. ఇక రైలులో ప్రయాణం చేసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ అనే సదుపాయలను కల్పిస్తుంది. ఇది ఇలా ఉంటే.. రైళ్లపై కొందరు చిల్లర పనులు చేస్తుంటారు. రైలు పట్టాలపై రాళ్లు, ఇతర వస్తువులు అడ్డం పెట్టి..ప్రమాదాలకు కారణం అవుతుంటారు. అంతేకాక మరికొందరు అయితే జర్నీలో ఉన్న ట్రైన్ పై రాళ్లు వేస్తుంటారు. తాజాగా కొందరు ఆకతాయిలు చేసిన పనికి ట్రైన్ లోని ప్రయాణికులు బుద్ది చెప్పారు. దీంతో ఇక చిల్లర పనులు చేయాలనుకునే వారికి ఇది ఒక గుణపాఠంలా అవుతుందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

కొందరు ఆకతాయిలు రైలు పరుగులు పెడుతున్నప్పుడు తాము ఏమి చేసిన ఆగదులే అనుకుంటారు. అందుకే రాళ్లు, ఇతర వస్తువులు విసిరేస్తూ.. శునకానందం పొందుతుంటారు. అలానే కొందరు ఆకతాయిలు కూడా రైలు ఆగదని ధీమాతో ఓ చెత్త పని చేశారు. రైల్వే ట్రాక్  ను ఆనుకుని ఉన్న  చెరువు వద్దకు కొందరు యువకులు వెళ్లారు. అందులో బైక్ ను తీసుకెళ్లి స్టాండ్ వేసి ఉంచారు. ఇక ట్రైన్ వచ్చే ముందు స్టాండ్ వేసి ఉంచిన బైక్ ను స్టార్ట్ చేశారు. ఇక బైక్ ఎక్స్ లేటర్ ఎక్కువగా ఇవ్వడంతో చక్రం స్పీడ్‌గా తిరుగుతూ.. రైలుపైకి నీళ్లు చిమ్ముతోంది. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులంతా తడిచిపోయారు.

ఇక ఈ ఆకతాయిలు చేసిన ఈ  చిల్లర పనిని పోలీసులు, రైల్వే సిబ్బంది, ప్రయాణికులు గమనించారు. వారికి ఎలాగైనా బుద్ది చెప్పాలని భావించి.. వెంటనే చైన్ లాగి రైలును ఆపేశారు. అంతే వేగంగా రైల్వే సిబ్బంది కిందకి దిగి..  పారిపోతున్న యువకుల్ని పట్టుకున్నారు. అంతేకాక ఆవేశంగా ఉన్న ప్రయాణికులు, పోలీసులు ఆ యువకులను చితకబాదారు. అనంతరం ఆ యువకులు తీసుకొచ్చిన బండిని రైల్లో వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది.

Show comments