iDreamPost
android-app
ios-app

ఇదేం ఘోరం.. బీరు ట్యాంకులో మూత్రం పోసిన వర్కర్‌!

ఈ బీర్ల కంపెనీకి ఆసియా వ్యాప్తంగా పేరుంది. అలా ఈ కంపెనీకి చెందిన ఓ వర్కర్‌ చేయకూడని పని చేశాడు. మూత్రం పోయడానికి ఎక్కడా చోటు లేనట్లుగా ఏకంగా బీర్లు నింపే ట్యాంకులో..

ఈ బీర్ల కంపెనీకి ఆసియా వ్యాప్తంగా పేరుంది. అలా ఈ కంపెనీకి చెందిన ఓ వర్కర్‌ చేయకూడని పని చేశాడు. మూత్రం పోయడానికి ఎక్కడా చోటు లేనట్లుగా ఏకంగా బీర్లు నింపే ట్యాంకులో..

ఇదేం ఘోరం.. బీరు ట్యాంకులో మూత్రం పోసిన వర్కర్‌!

జిహ్మకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్నట్లుగా.. కొంతమంది బుద్ధి పాడుగా ఉంటుంది. వారు చేసే కొన్ని పనులు చూస్తే అసహ్యం వేస్తుంది. ఇతరుల్ని ఇబ్బంది పెట్టడమే వీళ్లు పనిగా పెట్టుకుని ఉంటారు. తాజాగా, ఓ వ్యక్తి ఎవరూ చేయకూడని పని చేశాడు. నలుగురూ తాగే బీరు ట్యాంకులో మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చైనాలోని కింగ్‌డావాలో సింగ్టావో అనే ప్రముఖ బీర్ల కంపెనీ ఉంది. ఇది చైనాలోనే అతి పెద్ద బీర్ల తయారీ కంపెనీల్లో రెండోది.

ఈ బీర్ల కంపెనీకి ఆసియా వ్యాప్తంగా పేరుంది. అలా ఈ కంపెనీకి చెందిన ఓ వర్కర్‌ చేయకూడని పని చేశాడు. మూత్రం పోయడానికి ఎక్కడా చోటు లేనట్లుగా ఏకంగా బీర్లు నింపే ట్యాంకులో మూత్రం పోశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో అసలు విషయం బయటపడింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ కేఎఫ్‌సీలో స్ట్రాంగ్‌ అంటే అదే..’’.. ‘‘ చైనీస్‌ స్ట్రాంగ్‌ బీర్‌’’.. ‘‘ చైనాలో ఇలాంటి వన్నీ వాళ్లకు మామూలే’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 ఇక, ఆ వైరల్‌ అయిన వీడియో కంపెనీ దృష్టికి కూడా వెళ్లింది. సోషల్‌ మీడియా వ్యాప్తంగా కంపెనీపై కూడా విమర్శలు వచ్చాయి. వీటిపై సింగ్టావో కంపెనీ స్పందించింది. బీర్ల ట్యాంకులో వర్కర్‌ మూత్రం పోసిన ఘటనపై విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది. అతి త్వరలో ఇందుకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరి, చైనాలోనే అతి పెద్ద బీర్ల తయారీ కంపెనీ ఇలాంటి తప్పు జరగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.