iDreamPost
android-app
ios-app

వామ్మో ఈ ఆయా జీతం ఎంతో తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

  • Published Dec 29, 2023 | 1:15 PM Updated Updated Dec 29, 2023 | 1:15 PM

ఈ కాలంలో మధ్యతరగతి కుటుంబాల్లో భార్యాభర్తలు ఉద్యోగలు చేస్తేనే గడుస్తుందన్న విషయం తెలిసిందే. తమ చదువుకు తగ్గట్టు మహిళలు ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు.

ఈ కాలంలో మధ్యతరగతి కుటుంబాల్లో భార్యాభర్తలు ఉద్యోగలు చేస్తేనే గడుస్తుందన్న విషయం తెలిసిందే. తమ చదువుకు తగ్గట్టు మహిళలు ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు.

  • Published Dec 29, 2023 | 1:15 PMUpdated Dec 29, 2023 | 1:15 PM
వామ్మో ఈ ఆయా జీతం ఎంతో తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

సాదారణంగా నగరాల్లో ఉండే కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటారు. కుటుంబం ఆర్థిక కష్టాలు లేకుండా సాఫీగా సాగాలంటే ఇద్దరు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. తమ చదువుకు తగ్గట్లు మగవారితో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. అయితే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తే పిల్లలను చూసుకోవడానికి ఆయాని ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు కాస్త పెద్దవాళ్లు అయితే ప్లేయింగ్ స్కూల్ లో చేర్పిస్తున్నారు. కొంతమంది సంపన్నుల కుటుంబాల్లో పిల్లలనే కాదు పెద్దలను చూసుకోవడానికి కూడా కేర్ టేకర్ ని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఓ ఆయా జీతానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా ఆయాల జీతం రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటేంది.. మరీ ఉన్నత కుటుంబాలు, సెలబ్రెటీ ఇండ్లలో ఉంటే కేర్ టేకర్స్ కి ఒక లక్ష వరకు జీతం ఉంటుంది. కానీ ఓ ఆయాకు మాత్రం నెలకు రూ.18 లక్షల జీతం చెల్లిస్తున్నారు. అంతేకాదు.. ఆ ఆయ ఖరీదైన జీవితం అనుభవిస్తుంది. ఇంతకీ ఆ ఆయ ఎవరు? ఎందుకు అంత జీతం ఇస్తున్నారు? అన్న విషయం తెలుసుకుందాం. లండన్ కి చెందిన సోన్యా కుమార్ (28) ఏ గ్రేడ్ వీఐపీ ఇళ్లలో ఉండే పిల్లలకు ఆయాగా ఉంటుంది. అయితే సోన్యా కుమార్ తన ప్రొఫేషన్ లో ఎలాంటి రిమార్క్ ఉండకూడదన్న ఉద్దేశంతో స్పెషలైజేషన్ కోర్సులు చేసినట్లు సమాచారం. అందుకే సోన్యా కుమార్ ని ఆయాగా పెట్టుకోవడానికి బిజినెస్ మ్యాన్స్, ఫుట్ బాల్ ప్లేయర్స్, హాలీవుడ్ సెలబ్రెటీలు, హై ప్రొఫైల్ ఫ్యాషన్ డిజైనర్లు పోటీ పడుతున్నారు. ఇక సోన్యా కుమార్ ప్రత్యేకత ఏంటంటే.. ఆమెకు ఎలాంటి పిల్లలైనా ఇట్టే లొంగిపోతారు.. సొంత కుటుంబలోని మనిషిలా కలిసి పోతుందని అంటారు.

అందుకే సోన్యా కుమార్ ని తమ ఇంట్లో ఆయాగా ఎంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. వృత్తిపరంగా ఆమె ఎంతో డెడికేషన్ గా ఉంటుంది. ఆమె లండన్ కు చెందిన ప్రముఖ ఏజీన్సీకి వీఐపీ ఇళ్లలో ఆయాగా పనిచేస్తుంది. ఆమె జీతం ఏడాది అక్షరాల రూ.2.12 కోట్లు. అంతేకాదు ఆమెకు యజమానులు కొన్ని సందర్భాల్లో అత్యంత ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తుంటారు. సోన్యా కుమార్ విదేశాలకు వెళ్లినపుడు ఫైవ్ స్టార్ హూటళ్లో బస చేస్తుంది. క్రూజియ్ షిప్, ప్రైవేట్ జెట్స్ లో టూర్లకు వెళ్తుంది. అవన్నీ ఆమె యజమానులే ఏర్పాటు చేస్తుంటారుని టాక్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సోన్యా మాట్లాడుతూ.. ‘నేను నా 17 ఏళ్ల వయసులోనే ఆయగా పనిచేయడం మొదలు పెట్టాను. వాస్తవానికి నేను ఆయగా చేయడం ఇష్టముండదు.. కానీ పరిస్థితులు అన్ను ఆ వృత్తిలో కొనసాగేలా చేస్తుంది.

ఇప్పటి వరకు రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, యూఏ దేశాలతో పాటు ఐర్లాండ్ దీవుల్లో పనిచేశాను. కొత్తలో ఓ రెస్టారెంట్ లో ఉంటూ పార్ట్ టైమ్ గా ఆయా జాబ్ చేయడం మొదలు పెట్టాను.. ఇప్పుడు అదే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఇందులో జీవితం ఉందని అర్థమయ్యాక.. స్పెషల్ కోర్సులు చేశాను.. తర్వాత ఓ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నాను.. నా జీవితం ఇప్పుడు ఎంతో హ్యాపీగా సాగుతుంది’ అని అన్నాను. ఏది ఏమైనా ఆయకు ఇంత జీతం అనగానే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş